For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లి టచ్చింగ్--పనీర్ దో ప్యాజ్...

|

ఇది మరో ఇండియన్ టేస్టీ కర్రీ రిసిపి. ఉల్లిపాయలను ఎక్కువగా ఉపయోగించి తయారు చేసే టేస్టీ డిష్ లలో పనీర్ దో ప్యాజ్ ఒకటి. ఇందులో ఉపయోగించే ఇతర పదార్థాలతో పోల్చితే ఎక్కువగా పదార్థాలుంటాయి. ఈ పనీర్ దో ప్యాజ్ రిసిపికి ఉల్లిపాయల ముక్కలతోటి మరియు టమోటో ముక్కలతోటి ఫ్రై చేసి తయారు చేస్తారు. అలాగే ఇందులో టేస్టీ అండ్ క్రీమీ పన్నీర్ ను ఉపయోగిస్తారు. ఈ రిసిపిని ఏ సందర్భంలో అయినా తయారు చేసుకోవచ్చు.

చికెన్ సిక్స్‌టీ ఫైవ్ కావాలి... లోపల చికెన్ ఉండకూడదు! మటన్ బాల్స్ కావాలి... లోపల మటన్ తగలకూడదు! బేబీ కార్న్ కనిపించాలి... చుట్టూ జున్నులాంటిదుండాలి!
స్వీట్‌కార్న్ కనిపించాలి... స్మూత్‌గా పన్ను దిగుతుండాలి! ఔర్ కుచ్? టచింగ్‌గా రెండు ఉల్లిపాయలు... మనసు నచ్చింగ్‌గా... అల్లం వెల్లుల్లి గుబాళింపులు! ఓహో... అలాగా!
అయితే... ఈ పన్నీర్ దో ప్యాజ్ ను ఒక సారి లిప్ చేసి, టేస్ట్ చేయండి...

Paneer Do Pyaza Recipe

కావలసిన పదార్థాలు:
పనీర్ : 100grms
కారం: 2tsp
పసుపు : చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
జీడిపప్పు: 20grms(పొడి చేయాలి)
తర్బూజా గింజల పేస్ట్: 2tsp
అజినమోటో : 1/2tsp
బటర్ : 10 grms
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 25grms
ఉల్లితరుగు : 1cup
టొమాటోలు : 4
గరంమసాలా : 1tsp
నూనె : తగినంత

గార్నిషింగ్ కోసం:
సన్నగా తరిగిన జీడిపప్పు : కొద్దిగా
కరివేపాకు : రెండురెమ్మలు
క్యాప్సికమ్ తరుగు : 1/2cup
బెంగళూరు టొమాటో ముక్కలు : 1/2cup
ఉల్లిపాయలు : 2 (పొరలుగా తీయాలి) పైన చెప్పిన పదార్థాలను నూనెలో వేయించుకోవాలి.

తయారు చేయు విధానం:
1. ముందుగా పనీర్‌ ను డైమండ్ ఆకారంలో కట్ చేయాలి.

2. తర్వాత స్టౌ మీద పాన్ ఉంచి నూనె పోసి కాగాక పనీరు ముక్కలను వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించుకోవాలి. వేగించుకొన్న పన్నీర్ ను ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి.

3. తర్వాత అందే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయముక్కలు, కరివేపాకు జతచేసి వేయించాలి.

4. ఉల్లిపాయ ముక్కలు మెత్గా వేగిన, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి.

5. తర్వాత అందులోనే గరంమసాలా పొడి, అజినమోటో, తగినంత ఉప్పు వేసి కలపాలి .

6. కొద్దిసేపటి తర్వాత జీడిపప్పు పొడి, తర్బూజాగింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి బాగా కలిపి, కొద్దిగా ఉడుకుతుండగా పసుపు, కారం వేసి కలపాలి.

7. ముందుగా వేయించి ఉంచుకున్న పనీరు ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి.

8. చివరగా గార్నిషింగ్ కోసం వేయించి ఉంచుకున్న వాటితో అందంగా అలంకరించాలి.

English summary

Paneer Do Pyaza Recipe | పనీర్ దో ప్యాజ్-వెరీ టేస్టీ

This is yet another Indian curry recipe wherein amount of onion used is relatively larger compared with other main ingredients. In this paneer do pyaza recipe, sliced onions are pan-fried with spices and crushed tomatoes, which compliments the soft and creamy taste of paneer.
Desktop Bottom Promotion