For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ దోసె హాట్ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్

|

దక్షణ భారత దేశంలో బ్రేక్ ఫాస్ట్ రిసిపిలలో దోసె చాలా ఫేమస్. ఇండియన్ పాన్ కేక్ గా పిలుచుకొనే ఈ దోసె రిసిపి ఆరోగ్యకరం మరియు కడుపు నిండుగా ఉన్న అనుభూతినిస్తుంది . దీన్ని చాలా మంది ఉదయం అల్ఫాహారంగా తీసుకుంటారు . దీన్ని బియ్యం పిండితో తయారుచేస్తారు. అంతే కాదు అనేక రకాల మసాలాలతో ఫిల్ చేసి తయారు చేస్తారు. బంగాళదుంప నుండి, పనీర్ వరకూ దోసలో ఫిల్ చేసి చాలా టేస్టీగా తయారు చేస్తారు.

పనీర్ ఫిల్లింగ్ దోసె తయారు చేయడం చాలా సులభం. మీరు బ్రేక్ ఫాస్ట్ కోసం ఏదైనా వెరైటీగా తయారుచేసుకోవాలనుకుంటుంటే ఈ పనీర్ దోసె రిసిపిని ట్రై చేయవచ్చు. పనీర్ దోసెను సాధారణ దోసెలాగే తయారుచేవచ్చు. ఇక్కడ మార్చిందల్లా స్టఫింగ్ కోసం పనీర్ మాత్రమే. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Paneer Dosa

పనీర్: 1cup
ఉల్లిపాయలు: 2(సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిరపకాయలు: 3 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 1tsp
టమోటా: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)అవసరం అయితేనే.
ఉప్పు : రుచికి సరిపడా
జీలకర్ర: ఒక చిటికెడు
నూనె: 1tbsp

తయారుచేయు విధానం :
1. ముందుగా పన్నీర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఆ తర్వాత వాటిని, గరిటతో మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనెవేసి, వేడయ్యాక అందులో జీలకర్ర వేసి వేగించాలి.జ
3. జీలకర్ర చిటపటలాడిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4. తర్వాత అందులో పసుపు, ఉప్పు, టమోటో వేసి మీడియం మంట మీదు మెత్తగా ఉడికేవరకూ వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసి, తక్కువ మంట మీద 5-10నిముషాలు వేగించుకోవాలి. అంతే పన్నీర్ దోసె ఫిల్లింగ్ రెడీ. మసాలా దోసెకు బంగాళదుంప మిశ్రమాన్ని ఎలా దోసెలో ఫిల్ చేసి మనకు సర్వ్ చేస్తారో. అలాగే పన్నీర్ కూడా తయారుచేసి ఫిల్ చేసి తినవచ్చు. పన్నీర్ మిశ్రమాన్ని దోసె మద్యలో ఫిల్ చేసి బ్రేక్ ఫాస్ట్ గా అంధించడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది. దీన్ని చట్నీ లేదా సాంబార్ తో వేడి వేడిగా సర్వ్ చేయవచ్చు.

English summary

Paneer Dosa Filling Recipe

Dosa is the staple and filling breakfast dish in southern states of India. Dosa are the Indian pancakes which are healthy, filling and a perfect breakfast recipe for many people. It is prepared with the rice batter and often stuffed with many masalas.
Story first published: Monday, September 16, 2013, 11:22 [IST]
Desktop Bottom Promotion