For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్నీర్ మటర్ సింపుల్ అండ్ టేస్టీ డిష్

|

పనీర్ రిసిపి నార్త్ ఇండియన్ డిష్ . అయినా కూడా మన సౌత్ లో కూడా మన టేస్ట్ కు తగ్గవిధంగా తయారుచేస్తారు. మార్కెట్లో రెడీమేట్లో లభించే పనీర్ కాకుండా ఇంట్లోనే స్వయంగా పనీర్ ను తయారుచేసి వంటలకు ఉపయోగిస్తే చాలా రుచికరంగా ఉంటుంది. మరియు హెల్తీ కూడా..

ఈ హోం మేడ్ పనీర్ కు కొద్దిగా మటర్(పచ్చిబఠానీని )మిక్స్ చేస్తే చాలా మరింత టేస్టీ మరియు హెల్తీ కూడా. టమోటో జోడించడం వల్ల కర్రీ చిక్కగా తయారవుతుంది. మరి ఈ సాప్ట్ పనీర్ మరియు పీస్ రిసిపిని ఒక అద్భుతమైన ట్రీట్ గా ఉంటుంది కాబట్టి, ఈ కొత్త రుచిని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే, ఒకసారి ట్రై చేసి చూడండి...

Paneer Matar: With Goodness Of Homemade Paneer

కావల్సిన పదార్థాలు:
పాలు: 1ltr
నిమ్మకాయ: 1
ఉల్లిపాయలు: 2పెద్దవి
పచ్చిబఠానీలు: 1cup
పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగినవి)
జీలకర్ర: 1/2tbsp
గరం మసాలా: 1tbsp
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు : కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాత్రలో పాలు పోసి, బాగా మరిగించాలి. బాగా మరిగేటప్పుడు, అందులో నిమ్మరసం పిండాలి.
2. పాలు పెరుగుగా మారతానే స్టౌ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
3. చల్లారిన తర్వాత ఒక కాటన్ వస్త్రంలో, లేదా ఫిల్టర్ లో వడగట్టుకోవడం వల్ల సాఫ్ట్ పనీర్ వేరుపడుతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత టమోటో, ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. అంతలోపు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, మరియు ఉల్లిపాయలు వేసి రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత అందులోనే సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసి 15నుండి 20నిముషాలు బాగా వేగనివ్వాలి.
8. తర్వాత అందులో ఉప్పు మరియు గరం మసాలా వేసి బాగా వేగించాలి.
9. అదే సమయంలో, పచ్చిబఠానీలకు వేరే గిన్నెలో వేసి, కొద్దిగా నీళ్ళు మరియు ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
10. తర్వాత పాన్ లో వేగుతున్న పోపు మిశ్రమంలో ఉడికించుకొన్న పచ్చిబఠానీలను వేయాలి. మొత్తం మిశ్రమాన్నిఫ్రై చేస్తూ ఉడికించాలి.
11. ఇప్పుడు అందులోనే ముందుగా సిద్ధం చేసి పెట్టుకొన్న పీనర్ ను అందులో వేసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
12. మొత్తం మిశ్రమం ఉడికించుకొన్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఈ సింపుల్ పనీర్ మటర్ రిసిపిని నాన్ లేదా ఇతర ఇండియన్ బ్రెడ్ తో తీసుకోవచ్చు.

English summary

Paneer Matar: With Goodness Of Homemade Paneer

Paneer Matar recipe is a north Indian dish which can be prepared really fast. This simple recipe is made by mixing peas and paneer in a pan, along with tomatoes. The softness of paneer and peas, along with the tanginess of tomatoes is an excellent combination for a real treat.
Story first published: Friday, October 17, 2014, 12:32 [IST]
Desktop Bottom Promotion