For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రిసిపి

|

పన్నీర్ తో తయారు చేసే వంటలంటే చాలా వరకూ అందరీకి ఇష్టమే. ఇండియాలో చాలా వరకూ శాఖాహారాలు ఎక్కువగా తయారు చేస్తుంటారు . దరిదాపు దీని రుచి చికెన్ రుచిని కలిగి ఉంటుంది . ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ మరియు అధిక న్యూట్రీషియన్స్ ను కలిగి ఉంటుంది. పన్నీర్ క్యాప్సికమ్ ఇండియన్ రిసిపి దేశంలో బాగా ప్రసిద్ది చెందింది. పన్నీర్ స్టఫ్ క్యాప్సికమ్ చాలా రుచికరంగా వండుతుంటారు.

సౌత్ ఇండియన్ కర్రీకి జీలకర్ర మరియు కరివేపాకు చేర్చడం వల్ల రుచిగా ఉంటుంది. నార్త్ ఇండియన్ సైడ్ జీలకర్రతో మరియు కొత్తిమీరతో తయారు చేస్తారు.ఇతర ఇండియన్ కర్రీస్స్ తో పోల్చితే ఈ పన్నీర్ క్యాప్సికమ్ స్టఫ్డ్ కర్రీ అంతే స్పైసీగా ఉండదు. చూడటానికి చాలా సింపుల్ గా మరియు జీర్ణ అవ్వడానికి తేలికగా ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది.

Paneer Stuffed Capsicum Recipe

మరీ ఈ నార్త్ ఇండియన్ పన్నీర్ స్టఫ్ క్యాప్సికమ్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.
Serves: 4
Preparation time: 10 minutes
Cooking time: 20 minutes

Paneer Stuffed Capsicum Recipe

కావల్సిన పదార్థాలు:
క్యాప్సికమ్: 4(పెద్ద సైజ్)
పన్నీర్ : 250gms
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్ : 1tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ఛాట్ మసాల: 2tsp
ధనియాల పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
గరం మసాలా పౌడర్: చిటికెడు
జీలకర్ర: 1tsp
నూనె: 3tbsp

Paneer Stuffed Capsicum Recipe

తయారుచేయు విధానం:
1. ముందుగా క్యాప్సికమ్ ను శుభ్రంగా కడిగి తర్వాత తొడిమను తొలగించే అక్కడే చిన్న రంద్రం చేసుకొని విత్తనాలు మొత్తం తొలగించాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి క్యాప్సికమ్ వేసి ఉప్పు చిలకరించి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చి, మెత్తబడే వరకూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి జీలకర్ర వేసి వేగించుకోవాలి.
4.తర్వత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకూ వేగించుకోవాలి.

Paneer Stuffed Capsicum Recipe

5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్రపొడి, ధనియాల పొడి, ఛాట్ మసాలా, వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకొన్న పన్నీర్ తరుగు, ఉప్పు వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత అందులో గరం మసాలా పౌడర్ వేసి పన్నీ మెత్తబడే వరకూ ఫ్రై చేసుకోవాలి.
8. తర్వాత అందులోనే గరం మసాలాపౌడర్ వేసి పన్నీర్ పూర్తిగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి. స్టఫింగ్ రెడీ అయిన తర్వాత మంటను తగ్గించి తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి.
9. చల్లారిన తర్వాత పన్నీర్ లో స్టఫ్ చేసి తర్వాత సర్వ్ చేయాలి. అంతే పనీర్ స్టప్డ్ క్యాప్సికమ్ రెడీ. ఈ రుచికరమైన సైడ్ డిష్ ను రైస్ లేదా రోటీతో సర్వ్ చేయవచ్చు.

Paneer Stuffed Capsicum Recipe

న్యూట్రీషియన్ వ్యాల్యు: ఈ స్టఫ్డ్ పనీర్ రిసిపిలో 138క్యాలరీలు కలిగి ఉన్నాయి . ఇది లోఫ్యాట్ ఫుడ్ . ఇది వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్స్ కు ఫర్ఫెక్ట్ ఫుడ్.

Paneer Stuffed Capsicum Recipe

చిట్కాలు : స్టఫింగ్ కోసం లేదా ఫిల్లింగ్ కోసం చికెన్ ముక్కలను కూడా జోడించుకోవచ్చు.

Story first published: Saturday, December 20, 2014, 14:50 [IST]
Desktop Bottom Promotion