For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తందూరి పనీర్ టిక్కా మసాలా-అద్భుతమైన రుచి

|

నార్త్ ఇండియన్ వంటకాలు అద్భతమైన రుచితో పాటు నోరూరిస్తూ మనల్ని ఆకర్షిస్తుంటాయి. మాంసాహారం మాత్రమే కాదు శాఖాహార వంటలు కూడా మనల్ని టెప్ట్ చేస్తాయి. నార్త్ ఇండియాలో ముఖ్యంగా కొన్ని రకాల దాల్స్, కర్రీ, సైడ్ డిష్ లు చాలా సులభంగా తయారుచేసుకుంటారు. ముఖ్యంగా తందూరి వంటకాలు చాలా ప్రత్యేకం. ఒక్కసారి ఈ వంటలు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది.

నార్త్ ఇండియాలో ప్రతి ఒక్కరింట్లోనూ పనీర్ ప్రియులుంటారు. అక్కడి వారికి పనీర్ వంటలంటే చాలా ఇష్టం. ఏదైనా స్పెషల్ కార్యక్రమాలు, పార్టీలు వంటి కార్యక్రమాల్లో పనీర్ తో తయారుచేసిన వంటలు మెనులో లేకుండా ఉండవు. కాబట్టి, నార్త్ ఇండియన్ స్టైల్లో పనీర్ టిక్కా మసాలా ఎలా తయారుచేస్తారో అదీ తందూరి స్టైల్లో ఎలా తయారుచేస్తారో ఈ క్రింది పద్దతిని అనుసరించండి. నోరూరిస్తూ..చిక్కటి గ్రేవీలా ఉండే ఈ తందూరి పనీర్ టిక్కా మాసాలా ఎలా తయారుచేయాలో చూద్దాం..

Paneer Tikka Masala: Delicious Vegetarian Recipe

కావల్సిన పదార్థాలు
పనీర్: 250grm

టిక్కా కోసం కావల్సినవి:
క్యాప్సికమ్: 1(పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కారం: 1tsp
పసుపు: 1/2tsp
జీకలర్ర: 1tsp(దంచుకోవాలి)
ధనియాలు: 1tsp
జీలకర్ర: 1tsp
పెరుగు: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp

గ్రేవీ కోసం కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయ : 2(పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 2(మీడియం, గుజ్జులా తయారుచేసుకోవాలి)
అల్లం, వెల్లుల్లిపేస్ట్: 2tsp
ధనియాల పొడి: 2tsp
కారం : 1tsp
మెంతి: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తాజా క్రీమ్: 2tbsp
కొత్తిమీర: 2tbsp(గార్నిష్ కోసం)
నీళ్ళు: 1/2cup
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా పనీర్ ముక్కలను మ్యారినేట్ చేసుకోవాలి. అందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, ధనియాలపొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత అందులో పనీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మ్యారినేట్ పనీర్ ముక్కలను అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. అరగంట తర్వాత స్కీవర్స్ (ఇనుప చువ్వ)కు పనీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమోటో ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి గుచ్చి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు తవా వేడిచేసి నూనె వేసి, అందులో పన్నీర్ గుచ్చిపెట్టుకొన్న స్కీవర్స్ ను లాగే సర్ధి, 10నిముషాలు మీడియం మంట మీద బేక్ చేసుకోవాలి .
4. మద్యమద్యలో స్కీవర్స్ ను అన్ని వైపులా తిప్పుతూ ఉడికించుకోవాలి. పనీర్ తో పాటు ఇతర వెజిటేబుల్ ముక్కలు కూడా బాగా కాలే విధంగా ఉడికించుకోవాలి.
5. ఇలా బ్రౌన్ కలర్ లో ఉడికించుకొన్న తర్వాత స్కీవర్స్ ను తీసి పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర మరియు ఉల్లిపాయ వేసి, 4-5నిమిషాలు వేగించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి మరో 5నిముషాలు వేగించాలి. వెంటనే టమోటో గుజ్జు కూడా చేర్చి మరో 5నిముషాలు వేగించాలి.
8. ఎండిన మెంతి ఆకులను అరచేతిలో వేసుకొని బాగా నలిపి తర్వాత వేగుతున్న మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత వెంటనే ఉప్పు, నీళ్ళు కూడా జత చేసి బాగా మిక్స్ చేసి, ఈ మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద ఉడికించుకోవాలి
9. గ్రేవీ ఉడుకుతుండగా తాజా క్రీమ్ ను వేసి బాగా మిక్స్ చేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి .
10. ఇప్పుడు, ముందుగా బేక్ చేసి పెట్టుకొన్న పనీర్, టమోటో, క్యాప్సికమ్ ముక్కలను ఇనుప చువ్వనుండి నిధానంగా తీసి, చిక్కగా ఉడుకుతున్న గ్రేవీలో మిక్స్ చేయాలి.
11. ఒక నిముషం ఉడకినించి తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే రుచికరమైన పనీర్ టిక్కా మసాలా రెడీ. దీన్ని నాన్ లేదా పరోటాతో వేడి వేడిగా సర్వ్ చేయవచ్చు.

English summary

Paneer Tikka Masala: Delicious Vegetarian Recipe

North Indian cuisine is full of delicious and mouthwatering recipes. Not only non-vegetarian but vegetarian recipes are equally tempting. There are a variety of dals, curries and side dishes which are simply irresistible.
Story first published: Tuesday, September 24, 2013, 12:48 [IST]
Desktop Bottom Promotion