For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చిబఠానీ కోకోనట్ మిల్క్ పులావ్

|

పులావ్ ను వివిధ రకాలుగా తయారు చేస్తుంటారు. చాలా సులభంగా... రుచిగా తయారు చేసుకొనే బ్రేక్ ఫాస్ట్, లేదా లచ్ బాక్స్ రిసిపి పులావ్. వెజిటేబుల్ పులావ్, టమోటో పులావ్, పన్నీర్ పులావ్, మట్టర్ పులావ్, చికెన్ పులావ్ ఇలా రకరకాలుగా తయారు చేసుకుంటారు.

అదే విధంగా ఫ్రేష్ కోకోనట్ మిల్క్ తో తయారుచేసే ఈ పులావ్ రుచితో పాటు ఆరోగ్యం కూడా. కొన్ని స్పైసీలు జోడించి తయారు చేసే ఈ పులావ్ చేయడం కూడా సులభమే... మరి కోకోనట్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
పచ్చికొబ్బరి పాలు: 1cup
పచ్చి బఠానీ: 1cup
బిర్యాని ఆకులు: 3
పచ్చిమర్చి: 4
యాలకులు: 3
వెల్లిరెబ్బలు: 4-10
అల్లం: చిన్న ముక్క
జీడిపప్పు: 5-10
ఉల్లిపాయలు: 2-3
పుదీనా, కొత్తిమీర తరుగు: 1/2cup
లవంగాలు: 4
దాల్చిన చెక్క: చిన్న ముక్క
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి తగినంత

Peas and Coconut Milk Pulao

తయారు చేసే పద్ధతి:
1. ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కొబ్బరి తురుము మిక్సీలో వేసి దాని నుండి పాలు తయారు చేసుకోవాలి.
3. అలాగే అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
4. అంతలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి.
5. తర్వాత కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున పాలు పోసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు కుక్కర్‌లో నూనె వేసి కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం పేస్ట్, మసాల దినుసులన్నీ వేసి వేయించాలి.
7. కొద్దిసేపటి తర్వాత పచ్చి బఠాణీ వేసి వేయించి అందులో బియ్యం, పాలు పోసి కొత్తిమీర, పూదీనా తరుగు వేయాలి. బాగా కలిపి మూతపెట్టి సన్నని మంట మీద ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడకనివ్వాలి.
8. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇది ఉల్లిపాయ, పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

English summary

Peas and Coconut Milk Pulao | పీస్ అండ్ కోకోనట్ మిల్క్ పులావ్

Coconut and Peas Pulao is a delicious quick to make Indian rice recipe. Peas pulao can be eaten with almost any kind of gravy be it vegetarian or non-vegetarian. As a rice casserole recipe, peas pulao is easy to make and does not require too many ingredients.
Story first published: Friday, March 1, 2013, 12:16 [IST]
Desktop Bottom Promotion