For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్

|

పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉండే మీల్ లేదా డిన్నర్ ఫుడ్ ఇది టేస్ట్ బడ్స్ కు మరింత రుచి అందిస్తుంది. ముఖ్యంగా పెప్పర్ కార్న్ రైస్ కు అజినోమోటో మరియు సోయాసాస్ జోడించినప్పుడు మరింత టేస్ట్ ను అందిస్తుంది.

ఈ పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్ ను మీల్స్ లేదా డిన్నర్లో కూడా తీసుకోవచ్చు . అంతే కాదు, ఈ సింపుల్ రిసిపిని చాలా త్వరగా తయారుచేసి ఫ్యామిలీ మెంబర్ కు లేదా అనుకోకుండా వచ్చిన అతిథులకు అందివ్వవ్వచ్చు . ఖచ్చితంగా వారికి నచ్చుతుంది. మరి మిరియాలు జోడించడం వల్ల మరింత స్పైసీగా ఉంటుంది. మరి ఈ స్పైసీ అండ్ టేస్టీ పెప్పర్ కార్న ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Pepper Corn Fried Rice

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 1cup
మిరియాలు: 2tsp
మొక్కజొన్న : 1/2cup
నెయ్యి: 2tbsp
అజినోమోటో: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
సోయాసాస్: 1/2tsp
జీలకర్ర: 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
2. తర్వాత అందులో కొద్దిగా జీకలర్ర వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. తర్వాత మొక్కజొన్న గింజలు, మిరియాలపొడి, అజినమోటో, ఉప్పు, సోయాసాస్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత ముందుగా వండి చల్లార్ిచ పెట్టుకొన్న బాస్మతి రైస్ (ప్లెయిన్ రైస్ ) ను అందులో వేసి బాగా కలపాలి. అంతే పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ...

English summary

Pepper Corn Fried Rice

Corn and Pepper, they really gel with each other to give us a great treat to our taste buds, especially when they are coated with ajinomoto / soya sauce they are even more awesome. Here is a simple recipe that you can enjoy having it during lunch or dinner .
Story first published: Thursday, May 21, 2015, 13:01 [IST]
Desktop Bottom Promotion