For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెప్పర్ రసం: ఈజీ అండ్ హెల్తీ

|

ఆహారాల్లో ‘రసం'లో కంటే గొప్ప ఔషధగుణగణాలు ఎందులో ఉంటాయి చెప్పండి. ఇది సాధారణ జలుబు, దగ్గు, మరియు ఇతర అజీర్ణ సంబంధిత సమస్యలను నివారిండచంలో అద్భుతంగా పనిచేస్తుంది. మిరియాల రసం ఒక సూప్ వంటిది. దీన్ని సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తయారుచేసుకుంటారు.
పెప్పర్ రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు గొంతు ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. మరియు పెప్పర్ రసం సైనసైటిస్ ను మరియు తలనొప్పిని నివారిస్తుంది. ఇన్ని గొప్పఔషదగుణగణాలున్న ఈ టేస్టీ పెప్పర్ రసంను ఎలా తయారుచేయాలో చూద్దాం...
మిరియాల రసం ఆరోగ్యపరంగ మంచిది. దగ్గుకి, జలుబు మరియు జీర్ణ శక్తికి మంచి మందులా పనిచేస్తుంది. వేడి వేడి అన్నంలొ రసం వేసుకుని తింటే చాల రుచిగా వుంటింది.

Pepper Rasam Recipe – Easy And Healthy

కావలసిన పదార్థాలు:

మిరియాలు : 2tsp(పొడిచేసుకోవాలి)
జీలకర్ర: 1tsp(పొడిచేసుకోవాలి)
ఆవాలు: 1tsp
టమోటో : 1
వెల్లుల్లి రెబ్బలు : 6 -8(కచపచ దంతి పెట్టుకోవాలి)
ఎండు మిర్చి: 4-6(రెండుగా విరిచి పెట్టుకోవాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు
చింతపండు పులుసు: 1cup
బెల్లం: చిటికెడు
ఇంగువ: చిటికెడు
నెయ్యి: 2tsp
నీళ్ళు: సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర : కొంచెం

తయారు చేయు విదానం:

1. ముందుగ ఒక గిన్నెను తీసుకొని, అందులో గ్లాసు నీళ్ళు పోసి చింత పండును 5 నిముషాలు నానబెట్టుకోవాలి.
2. 5 నిముషాల తర్వాత చింత పండును కలుపుకొని, గుజ్జును వేరుగా తీసుకోవాలి. అందులో టమోటో కూడా వేసి బాగా పిసికి కొదిగా ఉప్పచేర్చి మొత్తం మిశ్రమం కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మందపాటి పాన్ తీసుకొని, స్టౌ మీద పెట్టి, అందులో కొద్దిగా నూనె,నెయ్యి వేసి, వేడయ్యాక అందులో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వేసి ఒక నిముషం వేగించాలి.
4. తర్వాత వెంటనే అందలో కచపచదంచి పెట్టుకొన్న వెల్లుల్లి, జీలకర్ర, మిరియాల పొడి, వెల్లుల్లి, ఎండు మిర్చి, ఇంగువ, బెల్లం వేసి ఒక నిముషం మీడియం మంట మీద వేయించుకోవాలి.
5. పోపు లైట్ గా వేగిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకొన్న టమోటో చింతపండు మిశ్రమాన్ని పోపులో పోయాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు చేర్చుకోవచ్చు.
6. పోపుతో మొత్తం మిశ్రమాన్ని కలగలిసేలా కలిపి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. చివరగా కొత్తమీర తరుగును చిలకరించుకోవాలి. రసం ఎక్కువగా కాగనివ్వకుండా, పైన నురనురగా వచ్చిన వెంటనే స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే పెప్పర్ రసం రెడీ. ఇది వేడిగా ఉన్నప్పుడే, ప్లెయిన్ రైస్ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మరియు ఆరోగ్యం కూడా....

English summary

Pepper Rasam Recipe – Easy And Healthy

What can be a better medicine than "Rasam" for common cold, cough and other digestion related ailments. Pepper rasam is the pick of today's recipes as it suits the best for the chilling winter. Pepper rasam is type of pepper soup that is eaten with rice and is famous in southern India.
Story first published: Wednesday, March 19, 2014, 11:59 [IST]
Desktop Bottom Promotion