For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పలహారి కడై పనీర్ రిసిపి: నవరాత్రి స్పెషల్

|

నవరాత్రి సమయంలో ఉపవాస దీక్షలు చేసేవారు చాలా మంది. ఎవరైతే వెయిట్ లాస్ డైట్ లో లేకుండా ఉంటారో, వారికి ఈ స్పెషల్ ఫలహారి కడై పనీర్ రిసిపి ఒక స్పెషల్ ట్రీట్. దీన్నిమద్యహ్నాన భోజనం లేదా డిన్నర్ కు ఈ వంటను తయారుచేసుకోవచ్చు . ఈ ఫలహారి కడై పనీర్ రిసిపిని చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద ఉన్నవారు ఇటువంటి వంటలకు ఖచ్చితంగా ట్రై చేయవచ్చు . ఫలహారం అంటే ఫ్రూట్ డైట్ . ఈ స్పెషల్ కడై పలహారి పనీర్ రిసిపి టేస్ట్ ఫ్రూట్ టమోటోతో తయారుచేస్తారు.

ఈ యామ్మీ నవరాత్రి స్పెషల్ రిసిపిని మీరు కూడా ఒక సారి ట్రై చేయవచ్చు. ఈ వంటను తయారుచేయడం చాలా సులభం మరియు ఎక్కువ సమయం పట్టదు. మరి ఈ స్పెషల్ నవరాత్రి స్పెషల్ ట్రీట్ ఎలా తయారుచేయాలో చూద్దాం....

Phalahari Kadhai Paneer Recipe: Navratri Special

కావల్సిన పదార్థాలు:
పనీర్: 500gms (కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
టమోటో: 8 (పేస్ట్ చేసుకోవాలి)
లవంగాలు: 5
దాల్చిన చెక్క: 2
జీలకర్ర : 2 tbsp
యాలకులు: 4
పెప్పర్(మిరియాలు): 3tbsp
అల్లం: 1 tbsp (ముద్ద)
పచ్చిమిర్చి: 3(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నెయ్యి : 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడయ్యాక అందులో లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు మరియు యాలకలు వేసి వేగించాలి.
2. ఒక నిముషం వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి, చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి.
3. అంతలోపు అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకనిముషం వేగిన తర్వాత అందులో టమోటో పేస్ట్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి.
4. వేగిన తర్వాత ముందుగా పొడి చేసుకొన్న మసాలా పౌడర్ ను కూడా అందోల వేసి మిక్స్ చేసి ఒక కప్పు నీళ్ళు అందులో పోయాలి.
5. మొత్తం మిశ్రం బాగా ఉడుకుతున్నప్పుడు పన్నీర్ ముక్కలను మరియు కొద్దిగా టమోటో ముక్కలను అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
6. ఈ మొత్తం మిశ్రమాన్ని 5-10నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
7. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు మరియు ఉప్పు కూడా వేసి మొత్తం మిశ్రమం మెత్తబడే వరకూ, గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి. అంతే ఫలహారి కడై పనీర్ రెడీ . ఈ రుచికరమైన నవరాత్రి స్పెషల్ రిసిపిని రోటిలకు మంచి కాంబినేషన్.

English summary

Phalahari Kadhai Paneer Recipe: Navratri Special

Navratri is a time for feasting and fasting. But for those who are on a weight loss diet, this special Phalahari kadhai paneer is a safe option for you to prepare this evening for dinner. The Phalahari kadhai paneer is easy to make and if you are health conscious then this is a must try.
Desktop Bottom Promotion