For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి వేడికి కడుపు చల్లచల్లగా ఉంచే దానిమ్మపెరుగన్నం

|

ఇండియన్ వంటకాల్లో పెరుగన్నం చాలా స్పెషల్ సైడ్ డిష్. సౌత్ సైడ వెళ్ళినట్లైతే ప్రతి భోజనానికి పెరుగన్నాన్ని చూడవచ్చు . ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు కడుపును చల్లగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతుంది . అంతే కాదు కడుపు నిండేలా చేస్తుంది.

పెరుగన్నాన్ని తయారు చేయడానికి చాలా పద్దతులున్నాయి, అందులో చాలా సింపుల్ గా మరియు అతి సాధారణంగా ఎక్కువగా తయారు చేసే కర్డ్ రైస్ అన్నం, పెరుగు, జీలకర్ర, తయారు చేస్తారు. అయితే ఇందులో మీకు ఇష్టమైన వెజిటేబుల్స లేదా పండ్లు కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. మరి మీకు ఇష్టమైన దానిమ్మ గింజలను ఉపయోగించి పెరుగు అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం.

Pomegranate Curd Rice Recipe

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 1cup
పెరుగు : 1cup
పాలు: 1/2cup
దానిమ్మ గింజలు: 1cup
నీళ్ళు : 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని బాగా శుభ్రం చేసి మంచి నీళ్ళతో కడగాలి .
2. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్లో బియ్యాన్ని వేసి సరిపడా నీళ్ళు మరియు పాలు పోసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
3. తర్వాత ఈ రైస్ బాగా చల్లారనివ్వాలి.
4. ఇప్పుడు అందులో పెరుగు, ఉప్పు, దానిమ్మ గింజలు, కొద్దిగా నీళ్ళు (అవసరం అయితేనే)బాగా కలుపుకోవాలి.
5. ఈ పెరుగు అన్నంను ఫ్రిజ్ లో పెట్టి అరగంట తర్వాత చల్లచల్లగా సర్వ్ చేయాలి. అంతే దానిమ్మ పెరుగు అన్నం రెడీ...

English summary

Pomegranate Curd Rice Recipe | గ్యాస్ట్రిక్ విరుగుడు పెరుగన్నమే...

Curd rice is a staple side dish in the Indian cuisine. If you go down to south, you can find curd rice with every meal. It is known to be very healthy and good for stomach. Curd cools the stomach, aids digestion and fights gastric problems. This makes it a filling rice recipe.
Story first published: Wednesday, April 10, 2013, 9:06 [IST]
Desktop Bottom Promotion