For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుమ్మడి సాంబార్: ఉగాది స్పెషల్ రిసిపి

|

తీపి గుమ్మడికాయ సాంబార్ ఒక ట్రెడిషనల్ రిసిపి. ముఖ్యంగా ఇది సౌత్ ఇండియన్ స్పెషల్ రిసిపి. దీన్ని తెల్లగుమ్మడి ముక్కుల మరియు కంది పప్పుతో తయారుచేస్తారు. రుచికరంగా ఉంటుంది. రుచికరమైన గుమ్మడి సాంబార్ రైస్ , ఇండ్లీ, సాంబార్, వడ వంటివాటికి ఒక కామన్ డిష్.

దీన్ని చాలా సులభంగా మరియు తర్వాగ తయారుచేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ ఫెస్టివల్ సీజన్ లో గుమ్మడి సాంబార్ రుచి చూడాలంటే ఎలా తయారుచేయాలో చూడండి...

Pumpkin Erissery: A Traditional Recipe

కావలసిన పదార్థాలు:

తీపిగుమ్మడికాయ ముక్కలు: 1cup
కందిపప్పు: 1cup
ఉల్లిపాయలు: 3
చింతపండు: నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి)
పచ్చిమిర్చి: 6
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
కారం: 1/2tsp
బియ్యప్పిండి: 1tsp
మెంతులు: 5-6సీడ్స్
ఆవాలు: 1/2tsp
నూనె: 2tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఇంగువ: చిటికెడు

తయారు చేయు విధానం:

1. ముందుగా పప్పును మరియు టమోటోను ప్రెజర్ కుక్కర్ లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ మెత్తగా ఉడికించుకోవాలి.
2. ఒక పాత్రలో గుమ్మడికాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, మెంతులు, నీరు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి, ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.
3. తర్వాత పసుపు, కారం, చింతపండు రసం, రెండు కప్పుల నీరు జత చేసి, బాగా కలపాలి.
4. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొన్న పప్పును వేసి బాగా కలిపి, ఉడుకుతున్న సాంబార్‌లో వేసి పదినిముషాలు ఉంచాలి.
5. తర్వాత స్టౌ మీద మరో డీప్ బాటమ్ పాన్ పెట్టి అందులో నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి, సాంబార్‌లో వేయాలి.
6. చివరగా సాంబార్ పొడి, కొత్తిమీర వేసి ఒక్క పొంగు రానిచ్చి దించేయాలి. అంతే గుమ్మడికాయ సాంబార్ రెడీ. ఇది ఒక టేస్టీ ట్రెడిషనల్ రిసిపి

English summary

Pumpkin Erissery: A Traditional Recipe

White pumpkin huli or sambar is a south indian curry made with white pumpkin and lentils. It is also called as poosanikai sambar in Tamil nadu. It is a popular accompaniment for rice, idlis, dosas or vadas and is a common dish in every south indian homes. Try one of the most popular traditional recipes and tangle the taste buds of your loved ones with this awesome recipe.
Story first published: Saturday, March 29, 2014, 12:14 [IST]
Desktop Bottom Promotion