For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ -బీన్స్ సబ్జీ : ఈజీ అండ్ టేస్టీ

|

ఒంటరిగా ఉంటూ, ఉద్యోగం చేసే వారు లేదా స్టడీస్ చేసే వారికి ఇటువంటి సులభమైన వంటలు చాలా బాగా సహాయపడుతాయి. ఎందుకంటే, వీటిని చాలా సింపుల్ గా త్వరగా తయారుచేయవచ్చు మరియు వీటికి ఎక్కువ మసాలా దినుసుల అవసరం ఉండదు. అంతే కాదు, చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు.

ఆఫీసు నుండో కాలేజ్ నుండే రాగేనే వంటచేసే ఓపిక లేకపోతే ఇటువంటి సింపుల్ రిసిపిలను ఎంపిక చేసుకొనే ఆరోగ్యకరమైన భోజనాన్ని రుచి చూడవచ్చు. అంతే కాదు, ఇలా హోం మేడ్ కుక్కింగ్ రిసిపిలు హెల్తీ మరియు ఎనర్జిటిక్ కూడా. మరి ఈ విషయాన్ని గుర్తించుకొని ఇటువంటి సులభ వంటలును తయారుచేయడం నేర్చుకోండి. అలాంటి సులభమైన వంటల్లో ఆలూ బీన్స్ సబ్జీ కూడా ఒకటి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Quick Aloo Beans Sabzi For Working People

ఆలు(బంగాళాదుంపలు): 4(కట్ చేసి, ఉడికించినవి)
గ్రీన్ బీన్స్: 7-8 (చిన్న ముక్కలుగా తరిగి ఉడికించాలి)
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా తరిగాలి)
వెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ఛాట్ మసాలా: 1tsp
మెంతులు: 1tsp
ఉప్పు: రుచి
నూనె: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. తర్వాత అందులో కొద్దిగా మెంతులు వేసి వేగనివ్వాలి.
2. తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం పచ్చివాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో పసుపు, కారం, ఛాట్ మసాలా, జీలకర్ర పొడి కూడా వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంప మరియు బీన్స్ కూడా వేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
6. రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. మొత్త ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఆలూ బీన్స్ కి సబ్జీ రెడీ. ఇది రోటీ లేదా పరోటాల్లోకి చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Quick Aloo Beans Sabzi For Working People

Being a working individual has its own constrictions. Work takes most part of the day and by the time you get back from office there is no energy left to cook something complicated. At such times you need recipes which can get ready in a few minutes. Apart from that you also need healthy, home cooked food to keep yourself energised.
Story first published: Thursday, September 11, 2014, 17:25 [IST]
Desktop Bottom Promotion