For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ అండ్ క్విక్ క్యాప్సికమ్ పులావ్

|

మన వంటకాల్లో రైస్ ఐటమ్స్ ఎప్పుడు ముందుంటాయి. అందులోనూ చాలా త్వరగా తయారుచేసే రైస్ వంటలు ముందు వరుసలో ఉంటాయి. మన దేశంలో ఏప్రదేశంలో అయినా సరే, రైస్ లేకుండా వారి భోజనం పూర్తి కాదు. అందుకే రైస్ లో కూడా వివిధ వెరైటీ వంటలున్నాయి.

ఈ రోజు మీకోసం ఒక సింపుల్ రైస్ రిసిపిని పరిచయం చేస్తుంది. ఈ వంట యొక్క ప్రత్యేకత, రెండు కలర్ ఫుల్ క్యాప్సికమ్ తో తయారుచేస్తారు. రెడ్ అండ్ గ్రీన్ మరియు ఎల్లో కలర్ క్యాప్సికమ్ తో తయారుచేసే ఈ రుచికరమైన వంట చాలా ఘాటైన ఆరోమా సువాస కలిగి ఉంటుంది. అలాగే క్యాప్సికమ్ మరియు జీడిపప్పు మరో ప్రత్యేకమైన రుచిని అంధిస్తుంది. మరి ఈ స్పెషల్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Quick and Easy Capsicum Pulao

కావల్సిన పదార్థాలు:
క్యాప్సికమ్: 6-8
జీలకర్ర: 1tsp
నెయ్యి: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
లవంగాలు: 4
ఉప్పు: రుచికి సరిపడe
బియ్యం: 1/2kg
పంచదార: 1tsp
దాల్చిన చెక్క కొద్దిగా
మిరియాలు: 6
ఉల్లిపాయ: 1
జీడిపప్పు పలుకులు: కొన్ని

తయారుచేయు విధానం:
1. ముందుగా క్యాప్సికమ్ ను ఉప్పు, చెక్కర వేసి ఉడికించుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి వేడి అయిన తరువాత జీలకర్ర, ఉల్లిముక్కలు, ఉప్పు, దాల్చిన చెక్క, లంవగాలు వేసి వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు సరిపడా నీళ్ళుపోసి అన్నం ఉడికించుకోవాలి ఉడుకుతున్నఅన్నంలో ముందుకు ఉడికించుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మూత పెట్టాలి.
5. అన్న అంతా ఉడికిన తరువాత కొత్తిమీర చల్లీ దించేయాలి. అంతే నూరూరించే క్యాప్సికమ్ పులావ్ రెడి..

English summary

Quick and Easy Capsicum Pulao

Want to know how to prepare capsicum pulao? Check out the recipe and give it a try...
Story first published: Friday, December 12, 2014, 17:57 [IST]
Desktop Bottom Promotion