For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ అండ్ స్పైసీ గోబీ మంచూరియన్

|

చైనీస్ ఫుడ్ అంటే అందరకీ చాలా ఇష్టమైన ఆహారం. ఒరిజినల్ చైనీస్ ఫుడ్ మనకు అందుబాటులో ఉండదు కాబట్టి, చైనీష్ స్టైల్లో మనం ఇండియన్ ఫుడ్ ను తయారుచేసుకోవచ్చు. అటువంటి వంటల్లో గోబీ మంచూరియన్ ఒకటి. వీటికి ఎక్కువ మసాలాలతో మరియు కారంగా ఉండే సాస్ తో రుచికరంగా తయారుచేస్తారు. ఈ ఇండో చైనీ రిసిపి స్పెషల్ ట్రీట్ చేస్తుంటారు .

మన ఇండియన్స్ కు చాలా ఇష్టమైన స్నాక్ రిసిపి మంచూరియన్. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో చికెన్ మంచూరియన్ ఒకటి . అదే విధంగా పెప్పర్ మరియు గోబీ మంచూరియన్ కూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది . మంచూరియన్ వర్షన్ వంటల్లో గోబీ మంచూరియన్ ఒకటి. చాలా పాపులర్ అయినటువంటి వంట. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Quick & Easy Gobi Manchurian Recipe
కావల్సిన పదార్థాలు:
కాలీఫ్లవర్: 1/2(మీడియం ఫ్లవర్, చిన్నచిన్న ఫ్లవర్స్ ను విడిపించుకోవాలి)
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

పిండి కలుపుకోవడం కోసం కావల్సిన పదార్థాలు:
మైదా: 5tbsp
కార్న్ స్టార్చ్: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
బ్లాక్ పెప్పర్: 1/4tsp
నీళ్ళు: 1/4cup
చిరుధాన్యాలు: 2tbsp
సాస్ కోసం:
నూనె: 1tbsp
ఉల్లిపాయం 1/2(మీడియంది, సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2-3(సన్నగా తరిగినవి)
వెల్లుల్లిపాయలు : 3 పెద్దవి
కెచప్: 2tbsp
రెడ్ చిల్లీ సాస్: 2tbsp
సోయాసాస్: 4tbsp
వైట్ వెనిగర్: 2tsp
నీళ్ళు: 4tbsp
కార్న్ స్టార్చ్: 2tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
2. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి 4-5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారగానే అందులో కెచప్ మరియు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి నూనె పైకి తేలే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో సోయా సాస్ మరియు వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
5. తర్వాత అందులో రెండు టీస్పూన్ల కార్న్ స్టార్చ్ నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసి బాగా మిక్స్ చేస్తూ 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు ఈ సాస్ ను పక్కన పెట్టుకోవాలి.
7. తర్వాత పిండిని తయారుచేసుకోవాలి. మైదా, కార్న్ స్టార్చ్, ఉప్పు, బ్లాక్ పెప్పర్ మరియు నీళ్ళు ఒక మిక్సింగ్ బౌల్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
8. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో కాలీఫ్లవర్ ను వేసి డిప్ చేసి కాగుతున్న నూనెలో వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
9. మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాస్ ను యాడ్ చేసి మిక్స్ చేయాలి.
10. మీడియం మంట మీద హీట్ చేయాలి. ఏమాత్రం తేమలేకుండా ఫ్రై చేయాలి. అంతే గోబీ మంచూరియన్ రెడీ . దీన్నీ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ తో సర్వ్ చేయాలి.

English summary

Quick & Easy Gobi Manchurian Recipe

We all love to hog on Chinese food. By Chinese, we don't mean the original Chinese food with bland taste. In India, we prepare Chinese food in our own unique way with a lot of spices and a lot of sauce. The Indo-Chinese recipes are a treat for the spice lovers because we, Indians know how to spice up our food the right way.
Desktop Bottom Promotion