For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రసేదార్ ఆలూ -గోభీ రిసిపి హెల్తీ అండ్ టేస్టీ

|

ప్రస్తుత రోజుల్లో కాంప్లికేటేడ్ వంటలంటే ఎవ్వరూ ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ద ఉన్నవారు ఆరోగ్యకరమైన వంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అటువంటి వంటల్లో ఆరోగ్యకరమైన వంటి ఇది ఒకటి. ఆరోగ్యకరంగా తినడానికి ఇంట్లో తయారుచేసే వంటలు మంచివి.

మన శరీరానికి అవసరం అయ్యే పోషకాంశాలను అందివ్వడంలో వెజిటేబుల్స్ ప్రధాన పాత్రను పోషిస్తాయి. మీరు మాంసాహార ప్రియులైనా వెజిటేబుల్స్ తినడంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అటువంటి హెల్తీ వెజిటేబుల్ వంట్లో ఇది ఒకటి. దీన్ని మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడుతారు. ఆలూ ప్రతి ఒక్కరి ఫేవరెట్ ఫుడ్ . కాబట్టి, ఈ వర్షిటైల్ వెజిటేబుల్ కి గోబీ జోడించి చేయడం వల్ల మరింత టేస్టీ మరియు ఆరోగ్యం. మరి ఈ హెల్తీ ఆలూ గోబి వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Quick & Easy Rasedar Aloo Gobhi Recipe

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 3(ఉడికించి పొట్టు తీసినవి)
కాలీఫ్లవర్: 1(చిన్నసైజు, ఉడికించినవి)
టమోటో: 3 సన్నగా తరిగినవి
అల్లం పేస్ట్: 1tsp
జీలకర్ర: 2tsp
కారం: 1tsp
పసుపు: 1tsp
పంచదార: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 1
నూనె: 2tbsp
నీళ్ళు: 1cup
కొత్తిమీర తరుగు: గార్నిష్ చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేగించాలి.
2. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిముషం వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించుకొన్ని బంగాళదుంపల్ని మరియు కాలీఫ్లవర్ ను వేసి రెండు, మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత పసుపు, కారం, పంచదార, జీలకర్రపొడి వేసి మరో 3-4నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. చివరగా నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేయాలి. తర్వాత మూట పెట్టి , మీడియం మంట మీద ఉడకనివ్వాలి.
6. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే రసేదార్ ఆలూ గోభీ రెడీ . దీన్ని రోటీ మరియు రైస్ తో సర్వ్ చేయవచ్చు.

English summary

Quick & Easy Rasedar Aloo Gobhi Recipe

Vegetables are the most important source of nutrirnts for the body. So, even if you are a meat lover, eating vegetables should also be on your priority list. And if you are not too fond of every kind of vegetable, then this recipe is definitely for your kind.
Story first published: Friday, October 17, 2014, 18:46 [IST]
Desktop Bottom Promotion