For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ అండ్ న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్ రాగి దోసె

|

Ragi Dosa
బ్రేక్ ఫాస్ట్ రిసిపిలల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇన్ స్టాంట్ రాగి దోసె. ఇది చాలా వరకూ అందరికి నచ్చతుంది!రాగి దోసెలో న్యూట్రిషియన్స్, అధిక శాతంలో ఫైబర్, క్యాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాంశాలు పుష్కలంగా ఉంటాయి. రాగి దోసెను రాగులను పౌడర్ చేసి,ఆ పౌడర్ తో దోసెను తయారు చేస్తారు. ఇది చాలా సులభంగా జీర్ణం కూడా అవుతుంది. టేస్ట్ తో పాటు మంచి వాసన కూడా ఉంటుంది.

రాగి దోసెను చాలా వరకూ సౌంత్ ఇండియాలో ఎక్కువ మంది తమ తమ ఇల్లలో తయారు చేసుకుంటారు . రాగి దోసె ఇంచుమించి రవ్వదోసెలాగే ఉంటుంది. ఈ రెండింటికి వ్యత్యాసం రాగిపిండి మాత్రమే . ఈ దోసెను వేడి వేడిగా తింటే చాలా రుచిగా కరకరలాడుతుంటుంది. ఇందులో పచ్చిమిర్చి, చేర్చడంతో కొద్దిగా స్పైసీగా అద్బుతమైన టేస్ట్ ను ఇస్తుంది. మరి హెల్తీ రాగా దోసెను ఎలా తయారు చేయాలో చూద్దాం....

కాల్సిన పదార్థాలు:
రాగిపిండి: 1cup
సెమోలిన : 1cup(రవ్వలాంటింది ఇది బయటమార్కెట్లో దొరుకుతుంది)
మైదా: 1/2cup
బియ్యం పిండి: 1/2cup
బట్టర్ మిల్క్: 1cup
నీళ్ళు : సరిపడా
ఉప్పు : రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 2 సన్నగా కట్ చేసుకోవాలి
జీలకర్ర: 1tsp
కొత్తిమీర తరుగు: 2tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పెద్దగిన్నె తీసుకొని అందులో పైన ఇచ్చిన పదార్థాలన్ని (నూనె తప్ప)వేయాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి, దోసెపిండిలా చిక్కగా కలుపుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద తవా లేదా పాన్ పెట్టి వేడి చేయాలి.(కొద్దిగా నీళ్ళు తవా మీద చిలకరిస్తే తావా బాగా వేడి అయ్యిండేది లేనిది తెలుస్తుంది). ఇప్పుడు మంట తగ్గించి, కొద్దిగా నూనె రాసి రాగిపిండి మిశ్రమాన్ని దోసెలా పోయాలి. తవా మొత్తం గరిటతో అలాగే సర్ధాలి. మద్యమద్య గ్యాప్ ఉంటే అక్కడ కూడా పిండిపోయాలి. కానీ గరిటగో రుద్దకూడదు. పై పైనే పిండిపోసి అలాగే వదిలేయాలి.
3. ఇప్పడు దోసె మీద నూనె చిలకరించాలి. దోసె చివర్లో చుట్టు కొద్దిగా నూనె వదలాలి.
4. ఇప్పుడు మీడియంగా మంట పెట్టి, రెండు మూడు నిముషాలు దోసె ఉడకనివ్వాలి/కాలనివ్వాలి. మీకు దోసె లైట్ గా స్మూత్ గా కాలితే చాలనుకొటే రెండు మూడు నిముషాల తర్వాత తవానుండి సర్వింగ్ ప్లేట్లోనికి మార్చుకోవాలి.క్రిస్పిదోసె కోరుకొనే వాళ్ళు. మంట పెంచి దోసెను బాగా కాలనివ్వాలి.
5. అంతే దోసె రెడీ. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని సాంబార్ లేదా ఉల్లిటమోటో చట్నీ లేదా పప్పుల పొడితో సర్వ్ చేయాలి. అంతే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి రెడీ.

చిట్కాలు:
1. బట్టర్ మిల్క్ అవసరం అయితేనే వేసుకోవచ్చు. లేదంటే నీళ్ళతోనే పిండిని కలుపుకోవచ్చు.
2. ఇంకా ఇందులో మీకు ఇష్టం అయితే ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, క్యారెట్ మరయు తాజా కొబ్బరి తురుము కూడా మిక్స్ చేసి రాగి దోసెను వెరైటీగా తయారు చేసుకోవచ్చు.

English summary

Ragi Dosa instant Healthy Breakfast | రాగి దోసె-ఉల్లి టమోటో చట్నీ-హెల్తీ బ్రేక్ ఫాస్ట్

Looking for an instant healthy breakfast meal that your family will love? The answer is Ragi dosa! Nutritious, high in dietary fibre, calcium and iron, ragi aka finger millet flour is gluten free, easily digestible with an earthy, nutty flavor. Ragi is popular down South and many families incorporate it in their daily meals in some form or the other.
Story first published:Saturday, March 30, 2013, 9:38 [IST]
Desktop Bottom Promotion