For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ స్పెషల్ : సోయా హలీమ్ రిసిపి

|

రంజాన్ మాసంలో తయారుచేసుకొనే ప్రసిద్దమైన వంటల్లో పాపులర్ అయిన వంట హలీమ్. హలీమ్ అంటానే ముఖ్యంగా గుర్తొచ్చేది చికెన్ మరియు మటన్ మరియు వివిధ రకాల పప్పుధాన్యాలు. నాన్ వెజ్ తోనే కాకుండా వెజిటేరియన్ పద్దతిలో కూడా హలీమ్ ను తయారు చేసుకోవచ్చు.

READ MORE: రంజాన్ స్పెషల్ చికెన్ హలీమ్

నాన్ వెజ్ టేస్ట్ తో తయారుచేసుకోవడానికి చికెన్ మరియు మటన్ కు ప్రత్యామ్నాయంగా సోయా చుంక్స్ ఉపయోగించి తయారుచేసుకోవచ్చు . వీటిని ఉపయోగించేటప్పుడు ఎక్కువ సమయం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు . ఈ హైదరాబాదీ సోయా హలీమ్ చాలా ఫేమస్ రిసిపి .

మరి ఇంకెందుకు ఆలస్యం రంజాన్ స్పెషల్ సోయా హలీమ్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Ramzan Special: Soya Haleem Recipe: Ramzan Recipes

కావల్సిన పదార్థాలు:
వెల్లుల్లి- 8-10 cloves
అల్లం - 30 gm
పచ్చిమిర్చి- 3 no
ఆలివ్ ఆయిల్- 3 tsp
ఉల్లిపాయలు- 250 gm (sliced)
కారం- 1 tsp
దాల్చిన చెక్క - 1
లవంగాలు- 2-3
బ్లాక్ పెప్పర్ కార్న్- 6
యాలకలు - 3
జీలకర్ర - 3 tsp
బిర్యానీ ఆకు- 3
సోయా - 1 cup
పెసెళ్ళు - 3 tsp
ఎర్రకందిపప్పు - 3 tsp
ఉద్దిపప్పు- 3 tsp
గోధుమరవ్వ- 50 gm
వెజిటేబుల్ స్టాక్ - 200 ml (వెజిటేబుల్స్ ఉడికించిన నీళ్లు)
జీలకర్ర - 1 tsp
ధనియాలపొడి - 1 tsp
గరం మసాల - 1 tsp
పసుపు - 1/2 tsp
కొత్తిమీర & పుదీనా- కొద్దిగా సన్నగా తరిగిపెట్టుకోవాలి

తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత వాటిలో నుండి కొన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. మిలిగిన సగం పాన్ లోనే ఉంచాలి.
4. తర్వాత పాన్ లో కొద్దిగా కారం, మిక్సీలో గ్రైండ్ చేసుకొన్నవేసి మిక్స్ చేసి ఫ్రై చేయాలి.
5. 5నిముషాలు ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బ్లాక్ పెప్పర్, యాలకలు, జీలకర్ర మరియు బిర్యానీ ఆకు వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
6. మసాలాలన్ని వేగి,పచ్చివాసన పోతున్నప్పుడు సోయా వేసి వేగించుకోవాలి . 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే గ్రీన్ మరియు బ్లాక్ గ్రామ్ వేసి వాటితో పాటు ఉద్దిపప్పు వేసి రెండు నిముషాలు ఫ్రైచేసుకోవాలి

READ MORE: ఖీమా సాగ్ రిసిపి : హెల్తీ రంజాన్ రిసిపి

8. అంతలోపు ఎర్రకందిపప్పుప్రెజర్ కుక్కర్లో వేసి 10నిముషాలు ఉడికించుకోవాలి.
9. కుక్కర్లో ఉడికించుకొన్న పప్పులో గోధుమరవ్వ, వెజిటేబుల్ స్టాక్ వేసి బాగా మిక్స్ చేసి మరో 5నిముషాలు ఉడికంచుకోవాలి.
10. ఈ మొత్తం మిశ్రమాన్ని పాన్ లో పోపు గ్రీన్ గ్రామ్ ఉడుకుతున్న మిశ్రమంలో వేసి, వీటితో పాటు, ఉప్పు, తాజా కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టి, మెత్తగా ఉడికించుకోవాలి.
11. పాస్తాకంటే చాలా సాఫ్ట్ గా ఉడికిన హలీమ్ కు తాజా కొత్తిమీర మరియు పుదీనా ఆకులు గార్నిష్ గా వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే సోయా హలీమ్ రిసిపి రెడీ...

English summary

Ramzan Special: Soya Haleem Recipe: Ramzan Recipes

Haleem is the most popular dish made during Ramzan with chicken or mutton and various dals. Today we are here to share a vegetarian version of this Haleem with soy granules & chunks.
Desktop Bottom Promotion