For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చి మామిడికాయ సేమియా ఉప్మా-సమ్మర్ స్పెషల్

|

ఒక రుచికరమైన అల్పాహారాన్ని తినాలనుకొంటున్నారా?మంచి రుచి, సువాసనతో ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ సంతోషకరంగా తినాలనుందా.?ఇంకెందుకు ఆలస్య ఒక డిఫరెంట్ బ్రేక్ ఫాస్ట్ తయారు చేసేసుకుందాం.

సమ్మర్ లో నేనున్నానంటూ వచ్చే మామిడికాయలు పుల్లగా నోరూరిస్తూ మంచి సువాసనతో ఉండే పచ్చిమామిడిని బ్రేక్ ఫాస్ట్ లో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది . సేమియా ఉప్మా తయారు చేయడం చాలా సులభం మరియు అతి త్వరగా కూడా అయిపోతుంది. కాబట్టి ఈ సమ్మర్ బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారుచేయాలో చూడండి.

Raw Mango Semiya Upma

కావల్సిన పదార్థాలు:
సేమియా: 2cups (కొద్దిగా నెయ్యి వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు 5 నిముషాలు వేగించుకోవాలి)
పచ్చి మిరపకాయలు: 3-4 (మద్యకు కట్ చేసుకోవాలి)
అల్లం చిన్న ముక్క: తురుము కోవాలి
పచ్చిమామిడికాయ తురుము: 3/4cup(పైపొట్టు తొలగించాలి
జీడిపప్పు:10-12(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నూనె: సరిపడా
నెయ్యి: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

పోపు కోసం
ఆవాలు: 1tsp
ఉద్దిపప్పు: 1/2tbsp
దాల్చినచెక్క :చిన్న ముక్క
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారు చేయు విధానం:
1. ముందుగా రెండుకప్పుల సేమియాకు రెండు కప్పుల నీళ్ళు పోసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి సాఫ్ట్ గా ఉడికించుకోవాలి. ఎక్కువగా మెత్తగా ఉడికించకూడదు . నీరు ఏమైనా అధికంగా ఉంటే వాటిని వంపేసి సేమియాను పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె మరియు నెయ్యి వేసి వేడిచేయాలి. అందులో ఆవాలు వేసి చిటపటలాడాక, ఉద్దిపప్పు, చెక్క, జీడిపప్పు, కరివేపాకు వేసి లైట్ గా 1 నిముషం వేగించాలి.
3. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి మరియు అల్లం తురుము కూడా వేసి అర నిముషం వేగించుకోవాలి .
4. తర్వాత అందులోనే పచ్చిమామిడికాయ తురుము కూడా వేసి, మంట మీడియంలో పెట్టుకొని 3-4నిముషాలు వేగించుకోవాలి. తర్వతా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి(ముందుగా సేమియా ఉడికించేటప్పుడు ఉప్పు వేసిన విషయాన్ని గుర్తించుకోండి. తగినంత మాత్రమే వేసుకోండి)
5. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొన్న సేమియాను వేసి పోపు, మ్యాంగో మిశ్రమం, సేమియా అంతా కలగలిసేలా బాగా కలుపుకోవాలి . బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పును సరిచూసుకోవాలి. అంతే మ్యాంగో సేమియా రెడీ. వేడి వేడిగా చట్నీ లేదా మీకు నచ్చిన ఊరగాయతో వడ్డించండి చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Raw Mango Semiya Upma | పచ్చి మామిడికాయ సేమియా ఉప్మా...

How about a savory breakfast with a tangy twist? Bursting with flavor and fragrant, our morning meal was delightful. With surplus raw mangoes at home, its been an overload of tangy goodness this past week. Mamidikaya (raw mango) Vermicelli Upma is quick and simple to prepare with few ingredients. For more spice increase the quantity of green chilies.
Story first published: Tuesday, April 16, 2013, 8:14 [IST]
Desktop Bottom Promotion