For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుమిర్చి కొబ్బరి పచ్చడి: టేస్టీ అండ్ స్పైసీ సైడ్ డిష్

|

సౌత్ ఇండియన్ డిషెష్ లో చట్నీలు చాలా ఫేమస్. తప్పనిసరిగా సైడ్ డిష్ లలో చట్నీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస, మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి.

వివిధ రకాల చట్నీలను వివిధ రకాల పదార్థాలతో తయారుచేస్తారు. టమోటో, చింతపండు, కొబ్బరి, కొత్తిమీర, మరియు ఎండుమిర్చి మరియు మరికొన్ని ఇతర పదార్థాలతో చట్నీలను తయారుచేస్తారు. ఈ పదార్థాలను సౌత్ ఇండియన్ చట్నీలన్నింటిలో దాదాపు అన్నింటిలో ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక సింపుల్ పండుమిర్చి కొబ్బరి పచ్చడి ఎలా తయారుచేయాలో తెలపడం జరిగింది. ఈ చట్నీ రిసిపి దోస, ఇడ్లీ, రైస్ మరియు రోటీలకు మంచి కాంబినేషన్ మరి, ఈ చట్నీ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Red Chilli Coconut Chutney

కావలసిన పదార్థాలు:
పండుమిర్చి : 150grm
కొబ్బరితురుము: 1cup
వెల్లుల్లి రేకలు: 10
అల్లం తురుము: 1tsp
ఆవపొడి: 2tbsp
ఎండుమిర్చి: 6
ఆవాలు: 1tbsp
పసుపు: 1tsp
చింతపండు: కొద్దిగా
మెంతిపొడి: 1/4tbsp
నూనె: కొద్దిగా
ధనియాలపొడి: 1tsp
జీలకర్రపొడి: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
ఇంగువ: 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పండుమిర్చిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, కొబ్బరితురుము వేసి వేయించాలి. చల్లారాక, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
3. అందులోనే కొద్దిగా అల్లం తురుము, చింతపండు జత చేసి మరోసారి గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి కాగాక ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించాలి.
5. పోపు దోరగా వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న పండుమిర్చి, కొబ్బరిపేస్ట్ వేసి వేయించాలి .
6. చివరగా ఆవపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలిపి మూడు నిమిషాలయ్యాక దింపేయాలి. అంతే పండు మిర్చి కొబ్బరి పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి రైస్ కు సైడ్ డిష్ గా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ చట్నీని దోస, ఇడ్లీలోకి కూడా తినవచ్చు

English summary

Red Chilli Coconut Chutney

Varieties of chutneys are made in India majorly in Southern India. Mainly green and red chutney are made to eat with dosas and idlis. Red chutney is slightly spicy, infused in Indian spices goes well with any thing actually.
Story first published: Tuesday, June 17, 2014, 12:14 [IST]
Desktop Bottom Promotion