For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోటీ స్పెషల్ - ఆలూ సబ్జీ

|

సాధారణంగా సబ్జీని వివిధ రకాలుగా తయారు చేస్తుంటారు. వాటిన్నింటిలో ఆలూ సబ్జీ చాలా టేస్ట్ గా ఉంటుంది. టేస్ట్ మాత్రమే కాదు, చాలా సులభంగా అతి తక్కవ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ఈ వంటను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వెజిటేరియన్ వారికి ఇటువంటి వంటలు కొంచెం డిఫరెంట్ గా అతి సులభంగా, తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు.

ఈ ఆలూ సబ్జీ బంగాళదుంప ముక్కలతో తయారు చేస్తారు. ఇది ఇంత అద్బుతమైన రుచిని కలిగి ఉండటానికి ప్రధానకారణం, ఇందులో మనం వాడే కలౌంజి (ఇది మార్కెట్లో లభిస్తుంది) అలాగే సీసాల్ట్ మరింత టేస్ట్ ను జోడిస్తుంది. ఈ ఆలూ సబ్జీ రోటి, రైస్ కు అద్భుత కాంబినేషన్ మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం...

Roti Special Aloo Ki Sabji

కావల్సిన పదార్థాలు:
బంగాళాదుంప: 4(పై పొట్టు తొలగించి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటా : 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిరపకాయలు: 2(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
నిమ్మరసం: 1tbsp
Kalounji: 1/2tsp
పసుపు: 1/2tsp
కారం: 1/2tsp
కొత్తిమీర: 2కాడలు(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
నూనె: 2tbsp
సీ సాల్ట్: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి వేడి చసి, అందులో kalounji(మార్కెట్లో లభ్యం అవుతుంది), మరియు పచ్చిమిర్చి వేసి, వేగించుకోవాలి.
2. తర్వా త అందులోనే కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు వేసి మీడియం మంట మీదు వేగించుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో టమోటోలను కూడా వేసి, దాని మీద నిమ్మరసం చిలకరించి, ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసి, అలాగే వదిలేసి, ఉడికించుకోవాలి.
4. రెండు నిముషాల తర్వాత మీడియం మంట మీద వేగిస్తూ, రెండు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టి మరో 10-15నిముషాల పాటు ఉడికించుకోవాలి అంతే ఆలూ సబ్జీ రెడీ. ఇది రోటీ మరియు రైస్ కు అద్భుతమైన కాంబినేషన్ .

English summary

Roti Special Aloo Ki Sabji

This is because, according to Hindu religious beliefs, onion and garlic are also non-vegetarian spices as they produce heat in the body.
Story first published: Monday, September 2, 2013, 12:46 [IST]
Desktop Bottom Promotion