For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాబుదాన కిచిడీ: శ్రీరామ నవమి స్పెషల్

|

ఉపవాస పలహారాల్లో సాబుదాన కిచిడి చాలా పాపులర్ అయినటువంటింది. ఉపవాసం ఉన్నప్పుడు ఇంటవంటి లైట్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ సాబుదానాను బ్రేక్ ఫాస్ట్ గాను లేదా లంచ్ బాక్స్ గాను తయారుచేసుకోవచ్చు. సాభుధాన కిచిడి చాలా తేలికగా జీర్ణం అవుతుంది. అందుకు ఉపవాస వేళకు ఇది ఫర్ ఫెక్ట్ గా నచ్చుతుంది.

మరి శ్రీరామనవి ఉపవాసం ఉండేవారు ఈ కిచిడీని ఫలహారంగా తీసుకోవచ్చు.

Sabudana Khichdi: Sri Ramanavami Special

కావలసిన పదార్థాలు:
సాబుదాన/సగ్గుబియ్యం: 1cup
ఆలుగడ్డలు: 1లేదా 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిబఠానీ: గుప్పెడు
కొబ్బరి తురుము: : 1cup(అవసరం అయితేనే)
జీలకర్ర: 1tsp
నెయ్యి: 1tsp
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర తరుగు: కొద్దిగా
పంచదార: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేసే విధానం:
1. ముందుగా సాబుదాన/సగ్గుబియ్యంను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. నీరు సరిపడా మాత్రమే పోయాలి. ఒక కప్పు సాబుదానకు రెండు కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
2. తర్వాత రోజు ఉదయాన్నే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, కరిగిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. అలాగే అందులో కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా మిక్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద వేగించుకోవాలి.
4. తర్వాత అందులో పచ్చిబఠానీలను వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము మీరు కలుపుకోవాలంటే, ఇప్పుడే వేసేయండి. (కొంత మంది కొబ్బరి తురుమును కిచిడికి వాడరు/కాబట్టి మీకు అవసరం అయితేనే ఉపయోగించండి)
5. ఇప్పుడు అందులో రాత్రి నీళ్ళలలో నానబెట్టుకొన్ని సాబుదాన వేసి నమిక్స్ చేయాలి. తర్వాత ఉప్పు, పంచదార వేసి మరో 10 నిముషాలు ఉడికించుకోవాలి .
6. చివరగా స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే వేడి వేడి సాబుదాన కిచిడి రెడీ. రైతా లేదా పండ్లతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Sabudana Khichdi: Sri Ramanavami Special

Sabudana Khichdi is a very popular fast recipe especially in the Western part of the country. It is a food you can eat safely when you are fasting for religious purposes. It is even otherwise a healthy Sabudana recipe for breakfast or to carry a lunch as lunch box to office.
Desktop Bottom Promotion