For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేమియా అటుకుల పొంగలి

|

స్వీట్ పొంగల్ ఒక ట్రెడిషినల్ వంటకం. దీన్ని ఎక్కువగా సౌత్ ఇండియాలో తయారుచేసుకొనే పాపులర్ స్వీట్ డిష్. కొంచెం డిఫరెంట్ గా తయారుచేసుకోవడం కోసం సేమియాకు అటుకులు, నెయ్యి, పెపసరప్పు, మిక్స్ చేసి తయారుచేస్తే చాలా టేస్టీ గా ఉంటుంది.

దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు చాలా తక్కువ వస్తువుల అవసరం అవుతాయి. అంతే కాదు, పెసరపప్పు, అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ రిచ్ గా ఉండే పదార్థాలతో సేమీయా అటుకుల స్వీట్ పొంగల్ ఎలా తయారుచేయాలో చూద్దాం..

Semiya

సేమియా: 1cup
అటుకులు: 1cup
పెసరపప్పు: 1/2cup
పంచదార: 2cupత
పాలు: 1/2ltr
యాలకలుపొడి : 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పెసరపప్పును ఉడికించి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి కొద్దిగా వేడయ్యాక అందులో సేమియా, అటుకులు, జీడిపప్పు, ఎండుద్రాక్షలను ఒక దాని తర్వాత ఒకటి విడివిడిగా వేయించుకోవాలి.
3. ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో పాలు పోసి వేడిచేయాలి.
4. పాలు మరుగుతున్నప్పుడు సేమియా, అటుకలు వేసి ఉడికించాలి.
5. ఐదునిముషాల తర్వాత పంచదార, జీడిపప్పు, ద్రాక్ష, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
6. చిక్కగా అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి సన్నని మంట మీద ఐదు నిముషాలు ఉంచాలి.
7. ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఉడికించి పెట్టుకొన్న పెసరపప్పును కలపాలి. ఇష్టపడితే చిటికెడు పచ్చకర్పూరం చల్లుకోవచ్చు. అంతే వేడి వేడి సేమియా, అటుకుల పొంగలి రెడీ. వేడిగా ఉన్నప్పుడు తింటే మరింత రుచికరంగా ఉంటుంది.

English summary

Semiya -Atukula(Poha)Pongal

Semiya Pongal is the delighful combination of two of the most popular south Indian food. Semiya is the popular breakfast among the Brahmin populations and Pongal is perhaps the most famous tamil Nadu food. Semiya Pongal is very easy and healthy recipe to prepare.
Story first published: Saturday, October 19, 2013, 13:27 [IST]
Desktop Bottom Promotion