For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాహి మష్రూమ్ బిర్యాని రెసిపీ-వెజిటేరియన్ స్పెషల్

|

మనకందరికీ నచ్చిన చాలా ఫేవరెట్ డిష్ లలో ఎక్కువ ఇష్టమైనది బిర్యానీ. అందులోనూ, చికెన్ లేదా మటన్ తో తయారుచేసిన బిర్యాని. అయితే అదే రుచిని అంధించే ఓ వెరైటీ వెజిటేరియన్ బిర్యానీని ఇక్కడ అంధిస్తున్నా. మష్రుమ్(పుట్టగొడుగులు)తినడానికి రుచి మాంసాహారంలాగే ఉంటుంది. కాబట్టి, చికెన్ కు బదులుగా మష్రుమ్ ను ఇక్కడ ఉపయోగించి కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో తయారుచేస్తున్నా. బిర్యానీ చాలా మందికి ఇష్టమైన రుచికరమైన డిష్. అలాగే ఈ మష్రుమ్ బిర్యానీని కూడా చాలా మంది ఇష్టపడుతారు. మీకుటుంబ సభ్యులతో పాటు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.

ఈ జ్యూసీ మష్రుమ్ రుచి మరియు సువాసన చాలా ఘాటుగా కొత్త రుచి బిర్యానీ ఒక కొత్త ట్రీట్ అనిపించవచ్చు. కాబట్టి, ఈ రుచికరమైన వెజిటేరియన్ బిర్యానీ రిసిపి తయారుచేయడానికి ఇది ఒక మంచి సమయం. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం..

Shahi Mushroom Biryani Recipe

కావల్సిన పదార్థాలు:
అన్నం కోసం
బాస్మతి బియ్యం : 2 cups
నెయ్యి : 2tbsp
లవంగాలు : 3- 4
బ్లాక్ ఏలకులు : 1
బ్లాక్ మిరియాల 3: 4
ఉప్పు: రుచికి సరిపడా

పుట్టగొడుగు మసాలా కోసం
నూనె: 2tbsp
లవంగాలు : 2
బ్లాక్ మిరియాల 3-4
బ్లాక్ ఏలకులు : 2
దాల్చిన చెక్క స్టిక్ : 1 అంగుళం
ఉల్లిపాయ: 1cup(ముక్కలుగా కట్ చేసుకోవాలి )
పచ్చి మిరప : 2 ( మద్యకు కట్ చేయాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
ధనియాలా పొడి : 2tsp
రెడ్ చిల్లి పౌడర్ : ½tsp
ఉప్పు:రుచికి సరిపడా
పసుపు : ½tsp
పుట్టగొడుగు : 200 GM
తాజా కొత్తిమీర : 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

గార్నిషింగ్ కోసం
ఉల్లిపాయ : ½cup
జీడిపప్పు : 5- 6
కుంకుమ పువ్వు: 1tbsp పాలలో చికెటికెడు కుంకుమ పువ్వు నానబెట్టుకోవాలి
కొత్తిమీర : 1tsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

ముందుగా రైస్ తయారుచేసుకొనే విధానం
1. ముందుగా బియ్యం కడగండి.
2. తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేయండి.
3. ఇప్పుడు అందులో లవంగాలు , బ్లాక్ ఏలకులు మరియు నల్ల మిరియాలు జోడించండి . ఒక నిమిషం వేయించాలి .
4. తర్వాత బియ్యం , 4కప్పుల నీరు మరియు ఉప్పు వేసి కలపాలి
5. ఇప్పుడు బియ్యం 3 / 4 వంతు ఉండికేంత వరకూ ఉడికించుకోవాలి.
6. ముప్పావు బాగం అన్నం ఉడికిన తర్వాత స్టౌ మీద నుండి తీసి పక్కన పెట్టుకోవాలి.

పుట్టగొడుగు మసాలా కోసం:
1. పుట్టగొడుగులను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక పాన్ లో నూనె వేసి వేడిచేయాలి .
3. తర్వాత అందులో లవంగాలు , నల్ల మిరియాలు, మరియు దాల్చిన జోడించండి. 30 సెకన్ల ఉడికించాలి .
4. ఉల్లిపాయలు మరియు పచ్చి మిరపకాయలు జోడించండి . ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. పచ్చి వాసన పోయే వరకూ 2- 3 నిమిషాలు వేగిస్తుండాలి.
6. అలాగే ధనియాల పొడి, ఎర్ర కారం, ఉప్పు మరియు పసుపు జోడించి 2- 3 నిమిషాలు వేయించాలి.
7. అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు జోడించండి. ఇప్పుడు అందులో పుట్టగొడుగులను వేసి పాన్ మూత పెట్టి ఉడికించాలి .
8. తర్వాత మూత తీసె ఫ్రై చేస్తూ పూర్తిగా వాటర్ అంతా ఇమిరిపోయే వరకూ ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగును జోడించండి .

గార్నిషింగ్ కోసం
ఉల్లిపాయల ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
అలాగే జీడిపప్పు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

రెండింటిని మిక్స్ చేయడం కోసం
ఒక పాన్ లో ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న అన్నంను ఫస్ట్ లేయర్ గా సర్ధాలి
2. తర్వాత దాని మీద మష్రుమ్ మసాలాను లోయర్ గా పచ్చాలి.
3. ఇతప్పుడు తిరిగా అన్నంను రెండవలేయర్ గా పాన్ లో పూర్తిగా సర్ధాలిజ
4. తిరిగి మష్రుమూ మసాలా లేయర్ గా మూర్తి అయ్యే వరకూ ఇలా లేయర్ గా పూర్తిగా సర్ధాలి.
5. ఇలా పూర్తిగా సర్ధి పెట్టుకొన్నాక చాలా తక్కువ మంట మీద 8-10నిముషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం పూర్తిగా ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు మూత తీసి పైన వేగించి పెట్టుకొన్నఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు,పాలలో నానబెట్టుకొన్న కుంకుమపువ్వు, కొత్తిమీర తరుగు ను గార్నిష్ గా సర్ధాలి.
7. అంతే షహీ మష్రుమ్ బిర్యానీ రిసిపి రెడీ, వెడివేడిగా సర్వ్ చేయాలి.

English summary

Shahi Mushroom Biryani Recipe

Biryani is one of the most favorite dish in our household. Although it's usually chicken or mutton biryani, this time I made a vegetarian version. Mushroom are known for the texture that is very meaty. So replacing chicken with mushroom did not made much difference.
Desktop Bottom Promotion