For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాలా ఆలూ - బీన్స్ సబ్జీ: శ్రావణమాసం స్పెషల్

|

శ్రావణ మాసంలో ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్స్ ను ఇష్టపడుతారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎక్కువగా ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి లేకుండా వంటలను తయారుచేస్తారు. శ్రావణ మాసంలో మసాలను ఎక్కువ వండరు. ఈ మాసంలో వాతావరణంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా పెరుగుతాయి. మరియు పూజలు, వ్రతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యం మీద శ్రద్ద ఉన్నవారు, ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.

మరి ఈ శ్రావణ మాసం స్పెషల్ గా ఈ రోజు ఒక సింపుల్ అండ్ స్పైసీ వెజిటేబుల్ డిష్ ను మీకందిస్తున్నాము. బంగాళదుంప, బీన్స్ తో తయారుచేసే ఈ వంటను రోటీలకు నేరుగా లేదా రైస్ కు సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు. మరి ఈ స్పెషల్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Shravan Recipe: Masaledar Aloo Beans Ki Sabji

కావల్సిన పదార్థాలు:

బంగాళదుంపలు: 4(మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు)
బీన్స్: 10-15 (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కలా జీర(ఉల్లిపాయ విత్తనాలు) : 1tsp
పసుపు :1/2tsp
ఎర్ర కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ధనియా పొడి: 1tsp
ఛాట్ మసాలా: 1tsp
మెంతి(మెంతులు): 1tsp
నూనె: 2tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా బంగాలదుంపలను కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని నీటిలో నానబెట్టాలి .
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో కాలజీర, మెంతులు వేసి కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత బంగాళదుంపల్లో నీరు వంపేసి వాటిని పాన్ లో వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేయాలి. తర్వాత అందులో బీన్స్ వేసి మరో 5-6నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, ధనియా, ఛాట్ మసాలా వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా నీటిని చిలకరించి మిక్స్ చేసి మూత పెట్టి, మరో 45నిముషాలు ఉడికించుకోవాలి . ఇప్పుడు కూరగాయలు పూర్తిగా ఉడికి ఉన్నాయని నిర్ధారించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మసాలా ఆలూ బీన్స్ సబ్జీ రెడీ. ఈ టేస్టీ శ్రావణ మాసం రిసిపిని రోటీ మరియు రైస్ కు సైడ్ డిష్ గాను సర్వ్ చేయవచ్చు.

English summary

Shravan Recipe: Masaledar Aloo Beans Ki Sabji

The month of Shravan is still on and people are heavily reliant on vegetarian food. Avoiding onions and garlic is a huge nuisance when it comes to cooking vegetarian food. Nobody prefers the bland taste and yet you have to follow the rules. But we, at Boldsky, try to take away the blandness from your food and make it interesting.
Story first published: Thursday, July 31, 2014, 17:40 [IST]
Desktop Bottom Promotion