For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రైడ్ గ్రీన్ చిల్లీ రిసిపి స్పైసీ అండ్ టేస్టీ సైడ్ డిష్

|

సాధారణంగా స్పైసీ వంటలంటే చాలా మంది ఇష్టపడుతారు. ముఖ్యంగా వర్షకాలంలో ప్రతి రోజూ కాస్త స్పైసీ వంటలు, సైడ్ డిష్ లు, పచ్చల్లు, ఫ్రైలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అటువంటి స్పైసీ వంటల్లో గ్రీన్ చిల్లీ ఫ్రై ఒక్కటి. చాలా సింపుల్ గా మరియు సులభంగా తయారుచేయచ్చు.

ఫ్రైడ్ గ్రీన్ చిల్లీ రిసిపిలో చిల్లీ బోండా, చిల్లీ బజ్జీ, బర్వా మిర్చి(స్టఫ్డ్ గ్రీన్ చిల్లీ)వంటి మన ఇండియన్ కుషన్స్ లో చాలా పాపులర్ వంటలు. గ్రీన్ చిల్లీతో తయారుచేసిన వడపావ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్ గా లేదా ఇండియన్ మీల్స్ కు సైడ్ డిష్ గా బాగా ప్రసిద్ది చెందాయి . కాబట్టి, ఈరుచికరమైన సైడ్ డిష్ ను మీరు కూడా రుచి చూడాలంటే, తయారుచేసే సింపుల్ విధానాన్ని తెలుసుకోవాల్సిందే...

Side Dish: Fried Green Chillies Recipe

కావల్సిన పదార్థాలు

పచ్చిమిర్చి 8-10
శనగ పిండి (బెంగాల్ గ్రామ్) - 3tbsp
ధనియాల పొడి 2 tbsp
కారం పొడి: 1tbsp
జీలకర్ర : 1tsp
డ్రై మ్యాంగో పౌడర్: 1tsp
నిమ్మరసం: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: 1tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడగాలి. తర్వాత పచ్చిమిర్చిని మద్యకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత బౌల్లో పచ్చిమిర్చిలో స్టఫ్ చేయడానికి మసాలాను సిద్దం చేసుకోవాలి. అందుకోసం బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, ధనియాల పొడి, కారం, డ్రై మ్యాంగో పౌడర్, ఉప్పు మరియు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. స్టఫ్ చేయకూడదు. అలా చేస్తే పచ్చిమిర్చి పూర్తిగా విరిగిపోతాయి. ఒక వేళ మసాలా మిగిలి ఉంటే పక్కన పెట్టుకొంటే, ఫ్రైయింగ్ సమయంలో ఉపయోగపడతుంది.
3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో జీలకర్ర వేసి వేగిన తర్వత అందులో స్టఫ్ చేసిన పచ్చిమిర్చి వేసి నిధానంగా ఫ్రై చేయాలి. క్రిస్పీగా తయారయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మిగిలిన స్టఫింగ్ మసాలాను కూడా వేసి మరికొన్ని నిముషాలు ఫ్రై చేసి తర్వత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
4. అంతే ఫ్రైడ్ గ్రీన్ చిల్లీ రిసిపి రెడీ. ఈ పుల్లపుల్లని మరియు స్పైసీ ఫ్రైడ్ గ్రీన్ చిల్లీని నిల్వచేసుకొని, మీ భోజనంతో సైడ్ డిష్ గా తీసుకోవచ్చు.

English summary

Side Dish: Fried Green Chillies Recipe


 We all love to add spice in our dishes. Few slit or chopped green chillies make your dish spicy and delicious. But we often tend to add green chillies as one of the ingredients to prepare a dish. However, you can also try various fried green chilli recipes that not only taste spicy, but are delicious to the taste buds too!
Story first published: Saturday, August 2, 2014, 13:04 [IST]
Desktop Bottom Promotion