For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ బైగన్ కా కర్రీ

|

ఆరోగ్యకరమైన ఆహారాలను పిల్లలకు అందివ్వడానికి కొంచెం కష్టమైన పనే. హెల్తీ వెజిటేబుల్స్ పిల్లకు అందివ్వడానికి ఫర్ ఫెక్ట్ కాంబినేషన్లో తయారుచేస్తే వారు ఇష్టంగా తింటారు. పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా కొంచెం వెరైటీగా, రెండు కాంబినేషన్లలో తయారు చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

అలా రెండు కాంబినేషన్ల వెజిటేబుల్స్ కు బంగాళదుంప, వంకాయతో తయారుచేసే వంటలు బాగుంటాయి. ఈ వంటను తయారుచేయడానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. మరియు మసాలా దినుసులు కూడా ఎక్కువ అవసరం లేదు. పిల్లలకు కూడా ఒక టేస్టీ ఫుడ్. మరీ ఈ రెండింటి కాంబినేషన్ లో ఆలూ బైగన్ కా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం..

Simple Aloo Baingan Ki Sabzi Recipe

కావాల్సినవి:

వంకాయలు: 4-5
బంగాళా దుంపలు: 2-3
ఉల్లిపాయలు: 60 grm
పచ్చిమిర్చి: 4
అల్లంవెల్లుల్లి: 1tsp
కారం: 2tsp
జీలకర్ర పొడి: 1/2tsp
ధనియాల పొడి: 1/2tsp
పసుపు: చిటికెడు
టమోటాలు: 4
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా

తయారు చేసే విధానం:

1. ముందుగా తెల్ల వంకాయలు,బంగాల దుంపలను ముక్కలు గా తరిగి ఉప్పు నీటిలో వేయండి.
2. తర్వాత ఒక గిన్నెలో నూనె పోసి కాచాక: సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని సన్నటి సెగమీద వేయించండి.ఆ తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద ,కారం,ధనియాలు,జీలకర్ర పొడి తో పాటు పసుపు వేసి కాయగూరముక్కల్ని కూడా కలిపి వేయించండి.ముక్కల్లో నీరు ఇంకిపోతే గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించండి.
3. కూర ఉడికిన తరువాత టమోటాలని ,తరిగిన కొత్తిమీర వేసి కాసేపు ఉడికించి తరువాత దించాలి.దీనిని రైస్ తో వడ్డిస్తే బావుంటుంది.

English summary

Simple Aloo Baingan Ki Sabzi Recipe

It's tough to get your kids to eat a healthy dish of vegetables. Unless you have just the perfect combination spices in the dish, you will have a difficult time to make your kids enjoy it. Apart from kids even grown-ups tend to get fussy about vegetables. So, to make it easy for you we have a tasty and simple recipe that you can try out.
Story first published: Monday, April 21, 2014, 12:14 [IST]
Desktop Bottom Promotion