For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింపుల్ సింధి స్టైల్ పెసరపప్పు రిసిపి

|

దాల్ (పప్పు) అంటే అందరికి చాలా ఇష్టమైన వెజిటేరియన్ రిసిపి. ముఖ్యంగా ఆంధ్రులకు అత్యంత ప్రీతికరమైనది. పప్పు లేకుండా ఆంధ్రుల బోజనం ముగయదు . పప్పును ఒకే విధంగా కాకుండా వివిధ రకాలు గా తయారుచేస్తారు. ఒకే విధంగా తయారుచేసే పప్పు బోరుకొట్టకుండా ఉండాలంటే, కొంచెం స్టైల్ మార్చితే ఒక కొత్త రుచిని టేస్ట్ చేయవచ్చు.

అంటువంటి డిఫరెంట్ పప్పు వంటల్లో సింధి స్టైల్ పప్పు ఒకటి. దీన్ని తయారుచేయడం చాలా సులభం. ఇందులో కొన్ని టమోటో గుజ్జు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు జోడించడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు రుచికరంగా ఉంటుంది.సింధి దాల్ రిసిపి మధ్యాహ్నా భోజనంలో పీస్ పులావ్, రైస్ లేదా పుల్కాలకు చాలా రుచికరంగా ఉంటుంది. అంతే కాదు, ఇది హెల్తీ కూడా, ప్రోటీలను అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి పలు రకాలుగా ఉపయోగపడుతుంది. మరి ఈ స్పెషల్ సింధి స్టైల్ పప్పును ఎలా తయారుచేయాలో చూద్దాం...

Simple Sindhi Moong Dal Recipe

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు: 2cups(నానబెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2(మద్యకు కట్ చేయాలి)
అల్లం: 2tsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటో: 2(మెత్తగా గుజ్జులా చేసి పెట్టుకోవాలి)
పసుపు: 1/4tsp
కొత్తమీర తరుగు: 2tbsp
ఉప్పు రుచికి సరిపడా

పోపుకోసం:
నూనె: 2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
జీలకర్ర: 2tsp
ఇంగువ: చిటికెడు

తయారుచేయు విధానం:
1. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి, 25నిముషాలు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుట వల్ల పప్పు మెత్తగా ఉడుకుతుంది.
2. ఇప్పుడు పాత్రలో నానబెట్టుకొన్న పెసరపప్పును వేసి సరిపడా నీళ్ళు పోసం 5నిముషాలు ఉండికించుకోవాలి. 5నిముషాల తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం, పసుపు, ఉప్పు వేసి మరో 30నిముషాలు ఉడికించుకోవాలి.
3. పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత హ్యాండ్ బ్లెండర్(పప్పు కట్టి)తో పప్పును మ్యాష్ చేసుకోవాలి. పప్పును మెత్తగా పామి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అందులో టమోటో గుజ్జును జోడించాలి. అలాగే కొత్తిమీర తరుగు కూడా వేయాలి. మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. .
5. ఈ మొత్తం మిశ్రమాన్ని మరో 10నిముసాలు ఉడికించుకోవాలి . అలా ఉడికించుకొన్న తర్వాత పోపు పెట్టుకోవాలి.
6. పోపు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి ఒక సెకను వేగిన తర్వాత, ఇంగువ కరివేపాకు వేసి వేగించాలి.
7. పోపు వేగిన తర్వాత అందులో పామి పెట్టుకొన్న పప్పును పోయాలి మొత్త మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగును గార్నిష్ చేయాలి. అంతే రుచికరమైన సింధి మూంగ్ దాల్ రిసిపి రెడీ...

English summary

Simple Sindhi Moong Dal Recipe

Dal is loved by all. It is one of the main dishes people opt for on a day to day basis. Today, Boldsky shares with you one of the best dal recipes prepared in a Sindhi style.
Story first published: Tuesday, November 18, 2014, 11:58 [IST]
Desktop Bottom Promotion