For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింపుల్ టేస్టీ మూంగ్ దాల్ సలాడ్ రిసిపి

By Super Admin
|

చలికాలం,వర్షాకాలంలో స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది! ఈ సూపర్ కూల్ క్లైమెట్ ను ఎంజాయ్ చేయాలంటే ? రుచికరంగా , హెల్తీగా ఛాట్ రిసిపిని రెడీ చేసుకోవాలి.

అలాంటి హెల్తీ ఛాట్ రిసిపి ఫ్రైడ్ మసాలా మూగ్ దాల్ రిసిపి. ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది. దీన్ని ప్రతి రోజూ సాయంత్రం స్నాక్ టైమ్ లో తీసుకోవచ్చు.

ఇది స్పెషల్ ఛాట్ రిసిపి, ఎందుకంటే ఇందులో ఎక్కువ న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స ఉంటాయి. మన వంటింట్లో ఉండే నిత్యవసర వస్తువు . అద్భుత రుచిని కలిగి ఉంటాయి. తయారుచేయడం చాలా సులభం.

తయారుచేయడానికంటే, ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి . మూగ్ దాల్ ను రెగ్యులర్ గా తింటుంటే, శరీరంలోని హీట్ తగ్గిపోతుంది . శరీరాన్ని చల్లబరుస్తుంది, చాలాసింపుల్ గా మరియు టేస్టీ రిసిపి . ఇది పెద్దలకు మాత్రమే కాదు పిల్లకు కూడా నచ్చేసాయంత్రపు చిరుతిండి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Simple Yet Tasty Masala Moong Dal Recipe

కావల్సినవి:

ఫ్రైడ్ మూగ్ దాల్ - 200 గ్రామ్స్

మొలకల సెసలు- 1/2 కప్పు

ఉల్లిపాయలు- 1/2 cup (సన్నగా కట్ చేసుకోవాలి)

టమోటో- 1/2కప్పు (సన్నగా కట్ చేసుకోవాలి)

క్యారెట్ - 1/2 కప్పు

చింతపులుసు - 1/2 టీస్పూన్

పచ్చిమిర్చి పేస్ట్ - 1/2 టీస్పూన్

బెల్లం సిరఫ్ - 1/2 టీస్పూన్

కొత్తిమీర - గార్నిష్ కోసం

నిమ్మరసం - 1/2 టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

పెద్ద బౌల్ తీసుకుని అందులో కొన్ని ఉల్లిపాయాలు, టమోటో, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి.

తర్వాత అందులోనే ఫ్రైడ్ మూగ్ దాల్ వేయాలి. తర్వాత మొలకలు పెసలు వేయాలి. తర్వాత కొద్దిగా చింత పులుసు వేయాలి.

అలాగే కొద్దిగా బెల్లం నీళ్ళు చిలకరించాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి

తర్వాత అందులోనే ఉప్పు మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే టేస్టీ మసాలా మూగ్ దాల్ రెడీ..

English summary

Simple Yet Tasty Masala Moong Dal Recipe

It's yet another chilly day! And are you enjoying this super cool climate at home? If so, then we shall make your day even better, by sharing with you a chaat recipe that is best suited for this climate.
Story first published:Wednesday, July 27, 2016, 15:05 [IST]
Desktop Bottom Promotion