For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంజాబి స్టైల్ సింధి చిక్ పీస్ మసాలా

|

శెనగలతో తయారుచేసే వంటలంటే చాలా వరకూ అందరికీ ఇష్టమే. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మన ఇండియాలో వంటలకు చిరుదాన్యాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అటువంటి ధాన్యాలలో చిక్ పీస్(శెనగలు)కూడా ఒకటి. ముఖ్యంగా నార్త్ సైడ్ ఎక్కువగా వీటి వాడకం ఉంటుంది. అలాగే సౌత్ లో కూడా చాలా సాధారణంగా వీటిని ఉపయోగిస్తుంటరు.

ఈ రుచికరమైన చిక్ పీస్ వంటలంటే పిల్లలకు చాలా ఇష్టం. పెద్దల కంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఈ రుచికరమైన చిక్ పీస్ తో తయారుచేసే పంజాబి స్టైల్ సింధి ఛోలే మసాల మీరు కూడా రుచి చూడాలంటే తయారు చేసే విధానం తెలుసుకోవాల్సిందే...

Sindhi Chole Masala Recipe

కావల్సిన పదార్థాలు:
శెనగలు: 2cups
ఉల్లిపాయలు: 2
తాజా కొత్తిమీర: 1కట్ట
టమోటాలు: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 3
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tsp
డ్రై మాంగో పొడి: 1tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు పొడి: 1tsp
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: 2cups

తయారుచేయు విధానం :
1. ముందుగా శెనగలను ఒక గిన్నెలో వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి 6గంటల పాటు నానబెట్టాలి.
2. 6గంటల తర్వాత, శెనగల్లోని నీరును వంపేసి, ప్రెజర్ కుక్కర్ లో వేసి, కొద్దిగా ఉప్పు వేసి, ఒక కప్పు నీళ్ళు పోసి 3 విజిల్స్ వచ్చే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
3. అంతలోపు కొత్తిమీరను శుభ్రంగా విడిపించి, మంచి నీటిలో వేసి కడిగి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపేస్ట్ మరియు పచ్చిమిర్చి అన్నింటిని మిక్సీలో జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
4. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో గ్రైండ్ చేసుకొన్నపేస్ట్ ను వేసి 2-3నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే టమోటో ముక్కలు కూడా వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. అనంతరం ధనియాల పొడి, పసుపు, డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసి మరో 3-4నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకొన్నశెనగలను వేసి, మరికొద్దిగా ఉప్పు కూడా జోడించి, అరకప్పు నీళ్ళు పోసి మరో 5 నిముషాలు ఉడికించుకోవాలి. మొత్తం సమయంగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే సింధి చోలే మసాలా రిసిపి రెడీ.

English summary

Sindhi Chole Masala Recipe

Chole is generally cooked in the Punjabi style in most of the households in a thick onion gravy and a blend of spices. But here we have a special Sindhi chole masala recipe which will give your taste-buds a delicious, tangy treat.
Story first published: Thursday, July 31, 2014, 12:02 [IST]
Desktop Bottom Promotion