For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోయా పరోటా హెల్తీ బ్రేక్ ఫాస్ట్

|

ప్రతి రోజూ సాధా పరోటాలను తిని బోరుకొడుతోందా? మరి అయితే ఈ సోయా పరోటాను ట్రై చేయండి. ఇది సోయా పరోటా మాత్రమే కాదు, ఇది చాలా సులభం మరియు చాలా డిఫరెంట్ రిసిపి. దీన్ని తయారు చేయండా చాలా సులభం మరియు టేస్ట్ కూడా అద్భుతం.

ఈ రిసిపిలో సన్నగా..చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకలు మరియు ఇతర మసాలాలతో ఫై చేసి, గోధుమపిండితో మిక్స్ చేసి పరోటాల్లా తయారు చేసి వేడి వేడిగా కాల్చుకొని తింటే చాలా రుచికరంగా ఉంటాయి. ఇవి తర్వాత తయారవుతాయి కాబట్టి, పిల్ల లంచ్ బాక్స్ లకు ఈజీ అవుతుంది. మరియు పెద్దలకు కూడా ఇష్టం అవుతుంది. మరి వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం..

Soya Parathas:Healthy Breakfast Recipe

కావల్సిన పదార్థాలు:
క్యాబేజీ: ½cup(తురిమి, ఉడికించుకోవాలి)
పెసరపప్పు: ¼cup(ఉడికించుకోవాలి)
సోయా(మీల్ మేకర్): ¼cup(పొడిచేసుకోవాలి)
బంగాళాదుంప: 1 (ఉడికించి, చిదిమిపెట్టుకోవాలి)
పచ్చి మిర్చి పేస్ట్: 1tsp
పసుపు: 1tsp
జీలకర్ర: 1tsp
నూనె: 3tbsp
కొత్తిమీర తరుగు: 1tbsp(చిన్న ముక్కలుగా తరిగాలి)
ఉప్పు : రుచికి సరిపడా
గోధుమ పిండి: 2cups
నీళ్ళు: 1cup

తయారుచేయు విధానం
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న క్యాబేజ్ తురుము మరియు పెసరపప్పు వేసి, మీడియం మంట మీద 3-4 నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులోనే సోయా పొడి, చిదిమి పెట్టుకొన్న బంగాళదుంప వేసి 4-5మీడియం మంట మీద వేగించుకోవాలి.
3. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి వేగించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి.
4. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, నీళ్ళు పోసి సున్నితంగా పిండిని కలుపుకోవాలి.
5. పదినిముషాల తర్వాత పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి.
6. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న స్టఫింగ్ ను చపాతీ మద్యలో పెట్టి మడిచి అన్ని వైపులా క్లోజ్ చేసి, తిరిగా చపాతీలా ఫ్లాట్ గా రోల్ చేసుకోవాలి.
7. తర్వాత స్టౌ మీద తవా పెట్టి, వేడయ్యాక స్టఫ్డ్ పరోటాను వేసి, వేడిచేస్తూ రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకొన్న తర్వాత మిగిలిన పరోటాలను కూడా అలాగే తయారుచేసుకోవాలి. అంతే స్టప్డ్ సోయా పరోటా రెడీ. ఈరుచికరమై బ్రేక్ ఫాస్ట్ రిసిపి కెచప్ తో లేదా మీకు ఇష్టమైన సైడ్ డిష్ తో తయారుచేయాలి.

English summary

Soya Parathas:Healthy Breakfast Recipe


 Paratha is one of the best breakfast recipe to try in the morning. Be it the stuffed parathas or the plain parathas, all the varieties of this Indian bread tastes simply delicious. So, let us make these yummy breakfast delights by adding a healthy twist to it.
Story first published: Wednesday, September 25, 2013, 11:39 [IST]
Desktop Bottom Promotion