For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ ఆలూ అండ్ గ్రీన్ బీన్స్ సబ్జీ

|

ఆలూ అండ్ గ్రీన్ బీన్స్ రిసిపి ఇండియాలో చాలా పాపులర్. ఆలూ అండ్ గ్రీన్ బీన్స్ సబ్జీ ఆరోగ్యానికి మంచిది మరియు దీన్ని 10 నుండి 15 నిముషాల్లోపల తయారుచేసేయవచ్చు. వీక్ డేస్ లో చాలా సింపుల్ గా వంట తయారుచేసుకోవాలనుకొన్నప్పుడు ఇటువంటి వంటలను ఎంపిక చేసుకోవచ్చు.

బిజీ షెడ్యుల్లో గడుపుతున్నప్పుడు, టేస్ట్ గా ఏదైనా తినాలనిపించినప్పుడు, ఆలూ బీన్స్ సబ్జీ ఫర్ఫెక్ట్ డిష్. ఈ వంటను స్పెషల్ గా డిన్నర్ కు తయారుచేసుకోవచ్చు. దీన్ని రోటీ, రైస్ కు ఫర్ఫెక్ట్ కాంబినేషన్ గా తయారుచేసుకోవచ్చు. ఈ వింటర్లో వెజిటేబుల్స్ ఫ్రెష్ గా అందుబాటులో ఉంటాయి. మరి ఇంకెదుకు ఆలస్యం గుప్పుడు గ్రీన్ బీన్స్ తెచ్చి ఫ్రెష్ గా హెల్తీగా డిన్నర్ డిష్ ను వండేయండి....

కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు: 2(కట్ చేసి ఉడకించి పెట్టుకోవాలి)
బీన్స్: 5-8(కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2
జీలకర్ర: 1/2tbsp
కారం: 1/2tbsp
పసుపు: 1/4tbsp
గరం మసాల: 1/2tbsp
ధనియాల పొడి: 1/2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, అందులో జీలకర్ర మరియు పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి. పచ్చిమిర్చి రోస్ట్ అయ్యే వరకూ వేగించాలి.

2. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే బంగాళదుంప మరియు గ్రీన్ బీన్స్ ముక్కలు కూడా వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

3. బంగాళదుంప, గ్రీన్ బీన్స్ కొద్ది సమయం వేగిన తర్వాత అందులో పసుపు, గరం మసాలా మరియు ధనియాల పొడి వేయాలి.

4. మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ ఒక నిముషం వేగించి, మూత పెట్టి మీడియం మంట మీద 10 నిముషాలు వేగించాలి.

Spicy Aloo And Green Beans Sabzi

5. అంతే సింపుల్ అండ్ టేస్టీ ఆలూ -గ్రీన్ బీన్స్ రిసిపి రెడీ. ఈ సింపుల్ రిసిపిని ఇంట్లో ఎప్పుడైనా తయారుచేసుకోవచ్చు .

English summary

Spicy Aloo And Green Beans Sabzi

Aloo and green beans recipe is popular in India. Aloo and green beans sabzi is a healthy dish and can be made in 10 to 15 minutes. This mid-weekday, do not work hard in your kitchen to make sabzi for dinner. You can make a dish that appeals to your taste buds in no time. Potato and green beans recipe is a blend of masalas in the right proportion. They are tasty as well.
Story first published: Thursday, November 20, 2014, 18:16 [IST]
Desktop Bottom Promotion