For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాదీ స్పైసీ బగారా రైస్

|

బగారా రైస్ చాలా సింపుల్ గా తయారు చేసేయొచ్చు. ఈ రైస్ ఐటమ్ హైదరాబాద్ లో చాలా ఫేమస్. ఈ రైస్ ను మొదట రుచి చూసిన వారు. చాలా అద్భుతంగా ఫీలవుతారు. అంతే కాదు మళ్ళీ మళ్ళీ తినాలని కోరిక వారిలో తప్పక ఉంటుంది. రుచితో పాటు మంచి ఫ్లేవర్ ఉన్న రైస్ హైదరాబాదీ స్పైసీ బగారా రైస్.

ఈ రైస్ ను ప్లైయిన్ గా తినవచ్చు. లేదా ఏదైనా సైడ్ డిష్ తోననూ తినవచ్చు . సైడ్ డిష్ కోరుకొనే వారు పెరుగు రైతా, పపాడ్ తో చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఇకెందుకు ఆలస్యం మీరూ తయారు చేసేసుకోండి.

Spicy Bagara Rice

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 2cups
ఉల్లిపాయలు: 3(తరగాలి)
పచ్చిమిర్చి: 10(సన్నగా తరగాలి)
కొత్తిమీర: ఒక కట్ట
పుదీనా ఆకులు: పదిహేను
టొమాటోలు: 6(చక్రాలుగా తరగాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర టీ స్పూన్లు
ఉప్పు: తగినంత,
నెయ్యి/ నూనె: 1/2cup
నీళ్లు: 7cups
దాల్చినచెక్క: నాలుగు ముక్కలు
లవంగాలు: 10
ఏలకులు: 8
కరివేపాకు: 2 రెమ్మలు

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేడి చేసి అందులోగా ఉల్లి తరుగును గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. అందులో పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, కరివేపాకు, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నమంట మీద పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
2. తరవాత అందులో టొమాటో చక్రాలు వేసి వేగాక కడిగి పెట్టుకున్న బియ్యం వేసి కొద్దిసేపు వేయించాలి.
3. అందులోనే ఉప్పు కూడా వేసి మరోమారు కలిపి ఏడు కప్పుల నీరు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే బగారా రైస్ రెడీ

English summary

Spicy Bagara Rice | హైదరాబాదీ బగారా రైస్

Bagara Rice is very simple and goes with any type of gravies. It does not have lots of masala in it, but just has the flavor and aroma of masala.
Story first published: Friday, December 28, 2012, 12:52 [IST]
Desktop Bottom Promotion