For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ బైగన్ ముస్లం రిసిపి

|

మీ లంచ్ మెనులో కొద్దిగా స్పసీలు(మసాలాలను)చేర్చండి, యమ్మీ టేస్ట్ ను ఎంజాయ్ చేయండి. అటువంటి వంటకాల్లో బైగన్ ముస్లమ్ ఒకటి . బైగన్ అంటే వంకాయ. ముస్లం అంటే ఫేమస్ గ్రేవీ, ముఖ్యంగా దీన్ని మాంసాహారంతో తయారుచేస్తారు. అదే స్టైల్లో వెజిటేరియన్ వంటను కూడా ప్రయత్నించండి.

ఈ అద్భుతమైన రుచి కలిగిన వంట, బైగన్ ముస్లం క్రీమ్ గా చిక్కటి గ్రేవీ చాలా టేస్ట్ గా ఉంటుంది. నోరూరించి ఈ వంట రుచి మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది . క్రీమ్ మరియు కొన్ని ప్రత్యేక మసాలా దినుసులు కాంబినేషన్లో బైగన్ ముస్లం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ అద్భుతమైన రుచిని టేస్ట్ చేయాలంటే ఈ క్రింది విధంగా తయారుచేయండి.

Spicy Baingan Musallam Recipe

కావల్సిన పదార్థాలు:
చిన్న వంకాయలు: 4-5
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 2tsp
పసుపు: ½tsp
టమోటోలు: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో గుజ్జు: 2tbsp
పంచదార: ½ tsp
ఉప్పు : రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
ఫ్రెష్ క్రీమ్: 3tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఆయిల్: 2tbsp
ఆయిల్: డీప్ ఫ్రై చేయడానికి

తయారుచేయు విధానం:
1. ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి కత్తితో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు డీప్ ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి, అందులో వంకాయలను వేసి మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
3. ఒక్కసారి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోనిక తీసి పెట్టుకోవాలి.
4. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనెను పాన్ లో వేసి అందులో జీలకర్ర వేసి చిటపట వేగనివ్వాలి.
5. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి, మీడియం మంట మీద వేగించుకోవాలి.
6. ఉల్లిపాయలు మెత్తగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి వేసి మరో 2,3నిముషాలు వేగించుకోవాలి.
7. దాని తర్వాత టమోటో ముక్కలు మరియు టమోటో గుజ్జు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
8. తర్వాత అందులో ఉప్పు, పంచదార వేసి 4,5 నిముషాలు వేగించుకోవాలి.
9. ఇప్పుడు అందులో ముందుగా వేగించి పెట్టుకొన్న వంకాయలను వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి తర్వాత తాజా క్రీమ్ ను అందులో వేయాలి.
10. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే స్పైసీ బైగాన్ ముస్లం రెడీ.

English summary

Spicy Baingan Musallam Recipe

Add a little spice to your lunch menu today with this exotic vegetarian recipe of baingan musallam. Baingan is the term for brinjal or eggplant in Hindi. Musallam is obviously a famous gravy which is usually made with meat. However using the same combination of spices for a plain vegetable like brinjal, you can make your meal burst with robust flavours.
Story first published: Saturday, April 26, 2014, 12:45 [IST]
Desktop Bottom Promotion