For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ దమ్ పన్నీర్ కాలీ మిర్చ్

|

పనీర్ వంటలంటే ఎవరి ఇష్టం ఉండదు చెప్పండి? అన్ని వయస్సుల వారు పన్నీర్ వంటలను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. మరి మీరు కూడా ఇక స్పైసీ పన్నీర్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారా? దమ్ పనీర్ కాలీ మిర్చి నార్త్ ఇండియన్ డిష్. ముఖ్యంగా ఇది పంజాబీ ట్రెడిషనల్ డిష్. అయినా ఈ దమ్ పనీర్ కాలీ మిర్చ్ మన ఇండియాలో ప్రతి రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల్లో తయారుచేస్తారు. ముఖ్యంగా ఇది ఇక రెస్టారెంట్ రిసిపి. ఈ వంటకు వివిధ రకాల మసాలాను దంటించి తయారుచేయడం. ఈ వంటకు కొన్ని బేసిక్ మసాలా దినుసులను ఉపయోగించడం వల్ల మంచి టేస్ట్ మరియు ఫ్లేవర్ కలిగి ఉంటుంది.

దమ్ పనీర్ కాలీ మిర్చి వెజిటేరియన్ డిష్. ఇది చపాతీ రోటీలకు మంచి కాంబినేషన్. అంతే కాదు, రైస్ కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అయితే బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, వైట్ రైస్ ఇలా దేంతో వండినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా స్పైసీగా మరియు టేస్టీగా నోరూరిస్తుంటుంది. ఇది ఒక అద్భుతమైన, రుచికరమైన డిష్. దమ్ పనీర్ కాలీ మిర్చిని చాలా సులభంగా, త్వరగా తయారుచేయడానికి ఈ క్రింది పద్దతిని అనుసరించండి...

Spicy Dum Paneer Kalimirch Recipe

కావలసిన పదార్థాలు :
పన్నీర్ : 500 grms
కొత్తిమీర : ఒక కట్ట
పుదీనా : ఒక కట్ట
పెరుగు : 1cup
ఉల్లిపాయ: 1
నెయ్యి : 2tbsp
బిర్యానీ ఆకులు: 2
దాల్చినచెక్క : 1
యాలకులు: 3
లవంగాలు: 4
ధనియాలపొడి: 2tbsp
జీలకర్రపొడి : 1tsp
మిరియాలపొడి : 1tsp
గరం మసాలా : 1/2tsp
ఫ్రెష్ క్రీమ్ : 100grm
పచ్చిమిరపకాయలు: 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tbsp

తయారుచేయు విధానం :
1. ముందుగా పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. వీటిని నూనె పీల్చుకునే కాగితం మీద వేసి పక్కన పెట్టాలి. 2. చల్లారిన తర్వాత ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
3. తర్వాత తిరిగి అదే పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి.
4. ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత పెరుగు వేశాక ధనియాలపొడి, జీలకర్రపొడి, ఉప్పు వేసి నీళ్లు పోయాలి. రెండు నిమిషాల తర్వాత పన్నీర్ వేసి బాగా కలపాలి.
5. ఆ తర్వాత కొత్తిమీర, ఫ్రెష్‌క్రీమ్, మిరియాలపొడి, గరంమసాలా పొడి వేసి మూత పెట్టేయాలి. వీలైతే మూతలేవకుండా చుట్టూ మైదాతో సీల్ చేయాలి. ఇప్పుడు మూత మీద బరువైనది ఏదైనా పెట్టి కాసేపు అలాగే ఉంచి దించాలి. అంతే నోరూరించే దమ్ పన్నీర్ కాలీ మిర్చ్ రెడీ!

English summary

Spicy Dum Paneer Kalimirch Recipe

Who doesn't like to have paneer? People of all ages love to have paneer. How about having a spicy paneer food? Sounds good? The Dum Paneer Kalimirch is a spicy paneer and black pepper recipe that has all the exotic spices going in for the making of the dish. This is a vegetarian recipe that makes your taste buds crave for more. Since most of the the exotic spices is used for the preparation of this vegetarian recipe, it can be considered as one of the healthy recipes.
Story first published: Saturday, December 13, 2014, 12:28 [IST]
Desktop Bottom Promotion