For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ మష్రుమ్ గార్లిక్ మసాలా రిసిపి

|

మష్రుమ్, వెజిటేరియన్స్ ఎక్కువగా ఇష్టపడుతారు. నాన్ వెజిటేరియన్ రుచి అందించే ఈ మష్రుమ్ గార్లిక్ మసాలా చాలా టేస్ట్ గా ఉటుంది. శాకాహారుల్లో కూడా చాలా మంది దీని వాసన, రుచి వారకి నచ్చక మష్రుమ్ లను తినరు. అయితే చిన్నగా ఉండే మష్రుమ్ ల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

ఉదాహరణకు ఇది క్యాన్సర్ తో పోరాడుతుంది. రక్తహీనతకు గురికాకుండా చేస్తుంది. ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది ఇది బెటర్ డైజషన్ మరియు గుండెకు మంచిది. ఇక ఈ చిన్న మష్రుమ్ లో న్యూట్రిషినల్ విలువలు చూస్తే గనుకు ఇందులో విటమిన్ డి, యాంటీయాక్సిడెంట్, పొటాషియం, కాపర్, సెలీనియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

మష్రుమ్: 250gms
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 5-6
టమోటో:2
అల్లం: 1 inch
వెల్లుల్లి రెబ్బలు: 7:8
పెరుగు: 2tbsp
కొబ్బరి తురుము: 1tsp
టమోటో కెచప్: 1tsp
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
ఎండుమిర్చి: 2
చెక్క: 1 inch
లవంగాలు: 1
బిర్యాని ఆకు: 1
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిడా
నూనె: 2tbsp
కొత్తిమీర తరుగు: 1tbsp (for garnishing)

Spicy Mushroom n Garlic Masala

తయారు చేయు విధానం:
1. ముందుగా మష్రుమ్(పుట్టగొడుగులను)కట్ శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, చెక్క, పచ్చిమిర్చి ఎండుమిర్చి మరియు లవంగాలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవసంర ఐతే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్ ను ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే టమోటో ముక్కలను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో బిర్యాని ఆకు వేసి లైట్ గా వేగిని తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి.
4. తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే టమోటో గుజ్జు కూడా వేసి బాగా ఉడికించాలి.
5. ఇప్పుడు అందులోనే కొబ్బిరి తురుము, పెరుగు, టమోటో కెచప్ మరియు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మసాల అంతా పచ్చివాసన పోయే వరకూ వేయించి తర్వాత శుభ్రం చేసి పెట్టుకొన్న మష్రుమ్ ముక్కలను వేయాలి.
6. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు పోసి చిక్కటి గ్రేవీలా తయారు చేసుకోవాలి. మీడియం మంట మీద పది నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే స్పైసీ మష్రుమ్ గార్లిక్ మసాలా రెడీ.

English summary

Spicy Mushroom n Garlic Masala Recipe | స్పైసీ మష్రుమ్ గార్లిక్ మసాలా

Mushrooms, the spore-bearing fungi is loved by vegetarians. However, there are many veggies who do not like to eat mushroom because of its appearance or taste. You would be surprised to know that the small mushrooms have many health benefits. For example, it helps fight cancer, boosts up immune system, fights free radicals, aids better digestion and is good for the heart too.
Story first published: Tuesday, February 12, 2013, 11:41 [IST]
Desktop Bottom Promotion