For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ పన్నీర్ టిక్కా రిసిపి: ఒక సంతోషకరమైన ట్రీట్

|

పనీర్ అంటే చాలా మంది ఇష్టం. పనీర్ తో తయారుచేసే వంటలంటే మరికొంత ఎక్కువగా లాగించేస్తుంటారు. ఇది కాటేజ్ చీజ్ దీన్ని మీరు ఏ గ్రేవీలో నైనా చాలా సులభంగా కలుపుకోవచ్చు. సాయంత్రంలో ఈ పనీర్ స్పెషల్ టిక్కా మాసాలా తయారుచేసుకొని హాపీగా తింటూ ఎంజాయ్ చేయవచ్చు. దీన్ని ఈవెనింగ్ టైమ్ లో స్నాక్ గా తినవచ్చు. లేదా రాత్రి డిన్నర్ కు సైడ్ డిష్ గా తినొచ్చు . ఈ స్పైసీ పన్నీర్ టిక్కా మసాలా తయారు చేయడం చాలా సులభం మరియు చాలా తక్కువ సమయం పడుతుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీకు మరింత కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి ఇంకా కలుపుకోవచ్చు.

ఈ స్పైసీ పనీర్ టిక్కా మసాలా ను ఎలా తయారుచేయాలో, వాటికి కావల్సిన వస్తువులేంటో క్రింది విధంగా ఉన్నాయి, వాటిన పరిశీలించండి. మరి ఈ ఈవెనింగ్ స్పెషల్ టేస్ట్ ను మీరు మిస్ కారు కాదా....

Spicy Paneer Tikka Recipe: Delightful Treat

కావల్సిన పదార్థాలు:
పనీర్: 250grm
పెరుగు: 1cup
ఉల్లిపాయ: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటా: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం / వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పచ్చిమిర్చి: 2(మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి)
జీడిపప్పు: 2tbsp(పేస్ట్ చేసుకోవాలి)
టిక్కా మసాలా: 1tbsp
ఛాట్ మసాలా: 1tsp
చెనా మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా మీరు పన్నీర్ ముక్కలను రౌండ్ గా లేదా క్యూబ్స్ గా మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, మీడియం మంట మీద వేడి చేయాలి.
3. నూనె వేడయ్యాక అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు మరియు టమోటో ముక్కలు వేసి మెత్తగా ఉడికే వరకూ వేగించుకోవాలి.
4. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చవాసన పోయే వరకూ వేగించుకోవాలి.
5. తర్వాత అందులో టిక్కా మసాలా వేసి, మరో 5నిముషాలు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
6. 5నిముషాల తర్వాత ఛాట్ మసాలా మరియు చెన్నా మసాలా కూడా వేసి, మీడియం మంట మీద బాగా వేగించుకవోాలి.
7. 5నిముషాల తర్వాత పెరుగు కూడా వేసి మిగిలన మిశ్రమాలన్నింటితో మిక్స్ చేస్తూ నిధానంగా ఉడికించుకోవాలి.
8. ఈ పదార్థాలను బాగా ఉడికిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్ని పన్నీర్ ముక్కలు కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి.
9. 10నిముషాల తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి మరియు ఉప్పు కూడా వేసి పన్నీర్ మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
10. ఇప్పుడు పదార్థాలన్ని బాగా మిక్స్ అయ్యేలా చేసి కలియబెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే మీ స్పైసీ పన్నీర్ టిక్ రెడీ. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ తో గార్నిష్ చేసుకోవాలి.

English summary

Spicy Paneer Tikka Recipe: Delightful Treat

One of the most loved foods by all is paneer. It is cottage cheese which is one of the best you can add to any sort of gravy. This evening, we give you a lovely recipe you can try out which can be eaten as a snack or with dal chawal.
Story first published: Thursday, November 21, 2013, 19:01 [IST]
Desktop Bottom Promotion