For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ పొటాటో రైస్ రిసిపి: టేస్టీ డిష్

|

చాలా సింపుల్ గా తయారయ్యే వంటల్లో పొటాటో రైస్ రిసిపి. సింపుల్ మాత్రమే కాదు టేస్టీగా ఉంటుంది మరియు హెల్తీ కూడా . ఈ సింపుల్ రిసిపిని తయారుచేయడానికి బంగాళదుంపలు మరియు కొన్ని మసాలా దినుసులు ఉంటే చాలు టేస్టీ రైస్ రిసిపి రెడీ...

అయితే బంగాళదుంపలో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల వారంలో ఒక్కసారి కంటే మించి తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి, బంగాళదుంపను మితంగా తీసుకోవాలి. మరి ఈ స్పైసీ పొటాటో రైస్ రిసిపిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం...

Spicy Potato Rice Recipe

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటో: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
రైస్: 1cup
అల్లం వెల్లుల్లిపేస్ట్ : 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
మసాలాలు: యాలకలు, దాల్చిన చెక్క, లవంగాలు (ఒక్కటి మూడు చొప్పును తీసుకోవాలి)
ఎండుమిర్చి : 1tsp
నీళ్ళు : 2cups
కొత్తిమీర : కొద్దిగా సన్నగా తరిగినది(గార్నిష్ చేసుకోవడానికి)

తయారుచేయు విధానం:
1. బముందుగా కుక్కర్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత అందులో అల్లం వల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన టమోటోలు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు మరియు మసాలా దినుసులు వేసి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత బంగాళదుంప ముక్కలు మరియు ఎండుమిర్చి కూడావేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. పోపు మొత్తం వేగిన తర్వాత అందులో కడిగిపెట్టుకొన్న బియ్య, సరిపడా నీళ్ళు పోసి 4విజిల్స్ వచ్చే వరకూ మూత పెట్టి ఉడికించుకోవాలి.
7. విజిల్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగును గార్నిష్ గా చిలకరించాలి .

English summary

Spicy Potato Rice Recipe

This afternoon prepare a yummy spicy treat for your loved ones. Boldsky shares with you a delicious mouth watering rice recipe - potato rice.
Story first published: Monday, April 6, 2015, 17:48 [IST]
Desktop Bottom Promotion