For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌత్ ఇండియన్ పొంగల్ రిసిపి: స్పైసీ అండ్ టేస్టీ

|

పొంగల్ ఇది ఒక క్లాసిక్ సౌత్ ఇండియన్ మీల్ రిసిపి. దీన్ని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా తినవచ్చు. ఈ పొంగల్ రిసిపిని మన సౌంత్ ఇండియన్ ఇల్లలో వారానికి ఒక సారైన వండాల్సిందే. ఈ స్పెషల్ పొంగల్ రిసిపిని సాధారణంగా పెసరపప్పు, బియ్యంతో తయారుచేస్తారు. అయితే మరింత టేస్టీగా మరియు హెల్తీగా తయారుచేయాలంటే ఇందులో కొన్ని వింటర్ వెజిటేబుల్స్ మిక్స్ చేయడం వల్ల అద్భుత టేస్ట్ కలిగి ఉంటుంది.

ఈ సింపుల్ పొంగల్ రిసిపిని తయారుచేయడం చాలా సులభం మరియు చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు. ఈవంటను పెద్దలు మాత్రమే కాదు, చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతారు. ముఖ్యంగా ఈ వంటకు వివిధ రకాల వెజిటేబుల్స్ జోడించడం వల్ల విటమిన్స్, మినిరల్స్, ఫైబర్ పుష్కలంగా అందుతాయి. మరియు ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ కూడా అంది, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది కడుపు నింపు, రుచికరంగా టేస్టీగా సంతోషపరచడంతో పాటు రోజంతా ఎనర్జీగా ఉండేందుకు సహాయపడుతుంది.

Spicy South Indian Pongal Recipe

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 1cup
పెసరపప్పు: 1cup
జీడిపప్పు: 10 nos
కార్న్స్: (చిన్న ముక్కలుగా)
పెసరపప్పు : ½ cup
బ్లాక్ మిరియాలు పొడి: 1tbsp
జీలకర్ర: 1tbsp
అల్లం: కొద్దిగా(సన్నగా తురిమి పెట్టుకోవాలి)
కరివేపాకు
నెయ్యి: 3tbsp
బటర్: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో బియ్యం, మరియు పప్పు వేసి ఒక సెకన్ ఫ్రై చేసి తర్వాత సరిపడా నీళ్ళు పోసి 10-15నిముషాలు మెత్తగా ఉడికించుకోవాలి.
2. తర్వాత పాన్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక అందులో బటర్ వేయాలి.
3. బటర్ కరిగిన తర్వాత అందులో జీలకర్ర, అల్లం తురుము బ్లాక్ పెప్పర్ కార్న్ మరియు కరివేపాకు వేసి ఒక సెకన్ వేగించుకోవాలి . పోపు వేగుతున్నప్పుడు ఆరోమా స్మెల్ వస్తుంది.
4. అప్పుడు అందులో జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. తర్వాత అందులోనే జీడిపప్పు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
6. అంతలోపు కుక్కర్ లో ఉడికించుకొన్ని బియ్యం మరియు పప్పును కుక్కర్ మూత తీసి స్పూన్ తో బాగా మిక్స్ చేస్తూ మరింత మెత్తగా చేసుకోవాలి.
7. దాని తర్వాత కుక్కర్ లో పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
8. ఇప్పుడు పాన్ లో పోపు వేసి ఫ్రై చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని కూడా కుక్కర్ లో వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
9. చివరగా బ్రౌన్ కలర్లో వేగించి పెట్టుకొన్న జీడిపప్పును గార్నిష్ చేసి సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకొని సర్వ్ చేయాలి. అంతే బటర్ పొంగల్ రెడీ. దీనికి కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్

English summary

Spicy South Indian Pongal Recipe

Butter pongal is a delicacy made of rice and dal with ghee. If you have been to south India, you must have tried pongal for sure. Earlier, this dish was made only during the harvest season. But now, if you go to any hotel for breakfast, pongal is an important item in their menu. The spicy butter pongal is an Indian risotto. You just would not want to miss them!
Story first published: Friday, October 24, 2014, 12:53 [IST]
Desktop Bottom Promotion