For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ -స్టఫ్డ్ బ్రింజాల్ ఫ్రై

|

స్టఫ్ చేసే వంటలు ఏవైనా సరే అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటాయి. చాలా మంది వంకాయలు తినడానికి ఇష్టపడరు. అయితే స్టఫ్డ్ బ్రిజాల్స్(గుత్తివంకాయను)తినడానికి మాత్రం ఎక్కువగా ఇష్టం కలిగి ఉంటారు.

సాధారణంగా వంకాయలతో వివిధ రకాల వంటలను వండుతుంటారు. అయితే గుత్తివంకా కూరంటే ప్రాణం లేసొస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది. అయితే గుత్తివంకాయ కర్రీ మాదిరి కాకుండా గుత్తి వంకాయనే ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది? అద్భుతమైన రుచి. ఓ డిఫరెంట్ టేస్ట్ తో నోరూరించాల్సిందే..గ్రేవీ లేకుండా పొడి పొడి అన్నంలోనికి రుచికరంగా ఉండే ఈ స్పైసీ స్టప్డ్ బ్రింజాల్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూడండి.

Spicy Stuffed Brinjal Fry

కావల్సిన పదార్థాలు:
వంకాయలు: 1/2kg
ఉల్లిపాయలు: 2పెద్దవి
వెల్లుల్లి: 4
ఉప్పు : రుచికి తగినంత
కారం: 1tsp
నూనె : వేయించడానికి తగినంత
పోపు కోసం:
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
మినపప్పు: 1tsp
వెల్లుల్లి పాయలు: రెండు లేదా మూడు
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారు చేయు విధానం:
1. ముందుగా వంకాయలను తొడిమ చివర కొద్దిగా కట్ చేసి (మొదలు విడవకుండా)అడుగున ప్లస్ ఆకారంలో గాట్లు పెట్టి, కాయలోపలి వైపు ఉప్పు రాయాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత వంకాయలోని నీరు పోయేటట్లు నొక్కి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అదే పాన్ లో మరో రెండు చెంచాల నూనె వేసి కాగిన తర్వాత అందులో పోపు దినుసులు వేసి లైట్ గా వేగనివ్వాలి.
4. పోపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపయా ముక్కులు, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు వేసి వేగించుకోవాలి.
5. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి దింపేసుకోవాలి .
6. వేడి తగ్గిన తర్వాత ముందుగా వేగించి పెట్టుకొన్న వంకాయాల్లో వేగించుకొన్ని మిశ్రమాన్ని కూరి సర్వ్ చేయాలి. అంతే ఇది అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Spicy Stuffed Brinjal Fry | స్పైసీ -స్టఫ్డ్ బ్రింజాల్ ఫ్రై

Stuffed vegetables are often good in taste. This recipe is one of my most most favvv !!! Stuffed vegetables are often good in taste. Many people do not eat brinjal, but Stuffed Brinjals are liked by them. You can make this recipe in many ways.
Story first published: Wednesday, May 15, 2013, 15:17 [IST]
Desktop Bottom Promotion