For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ విత్ చిల్లీ పనీర్‌ డ్రై

|

చిల్లీ పనీర్ డ్రై చాలా సులభంగా మరియు సింపుల్ గా తయారు చేసేటటువంటి పనీర్ వంటకం. ఈ స్పైసీ డిష్ ఇండియన్ రెస్టారెంట్స్ లో చాలా పాపులర్ అయినటువంటి స్టార్టర్. ఈ రిసిలో పన్నీర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఈ రిసిపికి కొన్ని మసాలా దినుసులతో పాటు క్యాప్సికమ్ మరియు పచ్చిమిర్చిలు అల్లం వెల్లుల్లి మరింత టేస్ట్ ను అందిస్తాయి.

మరి ఈ స్పైసీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ చిల్లీ పనీర్ డ్రై ను ఎలా తయారు చేయాలో చూదాం...

Spicy and Tasty Chilli Paneer Dry

కావలసిన పదార్ధాలు:

కాప్సికమ్‌: 200grm
పనీర్‌: 250grm
ఉల్లిపాయ తరుగు: 1cup
పచ్చి మిర్చి : 4
టొమాటోలు: 2(పెద్దవి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 2tbsp
ఉల్లిపాయ పేస్ట్‌ : 2tbsp
టొమాటో ప్యూరీ : 2tbsp
సోయా సాస్‌ : 2tbsp
చిల్లీ సాస్‌ : 1tsp
మిరియాల పొడి: 1/2tsp
నీళ్ళు : 1/2cup
నూనె : 2 cups
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేసే విధానం:
1. ముందుగా కాప్సికమ్‌ను, ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. పనీర్‌ను పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. పచ్చి మిరపకాయలను మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి. టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి కాప్సికమ్‌, పనీర్‌, ఉల్లిపాయ ముక్క లు, టొమాటోలు ఒక దాని తర్వాత చిటికెడు ఉప్పు వేస్తూ వేసి వేయించి ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి.
3. నూనెను తిరిగి వేడి చేసి, దానిలోనే ఉల్లిపాయ పేస్ట్‌ వేసి రెండు నిమిషాలు వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి.
4. తర్వాత టొమాటో ప్యూరీ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అందులో కారం, మిరియాల పొడి వేసి ఒక అర నిమిషం వేగనివ్వా లి.
5. అందులోనే చిల్లీ సాస్‌, సోయా సాస్‌ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్‌, పనీ ర్‌, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి ఐదు నుంచి నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. చిల్లీ పనీర్‌ రెడీ.

English summary

Spicy and Tasty Chilli Paneer Dry | స్పైసీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ చిల్లీ పనీర్‌ డ్రై

Chilly Paneer dry is one of the simplest & easy to make paneer recipe...!
 This spicy oriental dish is a very popular Starter in Indian restaurants. In this recipe, the paneer cubes are coated with thick batter and golden fried in oil. Then it is sauted in spicy ingredients and sauces. This yummy dish is sure to lure our taste buds..!!!
Story first published: Saturday, May 11, 2013, 15:17 [IST]
Desktop Bottom Promotion