For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ అండ్ టేస్టీ వెజిటేబుల్ దాల్ రిసిపి

|

దాల్ (పప్పు)మన ఇండియన్ స్పెషల్ వంట. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఈ వంటను వివిధ రకాల పప్పు దినుసులతో తయారుచేస్తారు. వంటకు ఉపయోగించే పప్పు దినుసులు వివిధ రకాలు ఉన్నాయి. వీటితో వివిధ రకాల వంటలు మరియు సైడ్ డిష్ లను తయారుచేస్తారు .

పప్పులతో పాటు కొన్ని రకాల వెజిటేబుల్స్ ను మిక్స్ చేసి తయారుచేయడం వల్ల మరింత రుచిగా ఉంటుంది . దాల్ తడ్కా చాలా పాపులర్ వంట. కొన్ని మసాలా దినుసులు, పప్పులు, టమోటో, క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంపలు వేసి తయారుచేస్తారు. అలాగే మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు వంటివి జోడించడం వల్ల ఈ ఇండియన్ డిష్ మరింత టేస్టీ గా ఉంటుంది.

Spicy Vegetable Dal Recipe

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు: 1cup
తడ్కాదాల్ (శెనగపప్పు): 2tbsp
బంగాళ దుంపలు 2 (పొట్టు తీసి మరియు మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
కాప్సికమ్ 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
క్యారెట్ 1 (సన్నగా కట్ చేసుటకోవాలి)
టమోటో: 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి 3-4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: ½ అంగుళం (తురుముకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5-6 (పేస్ట్ చేసుకోవాలి)
పసుపు: 1 ½tsp
కారం: 1tsp
గరం మసాలా: 1tsp
Amchur (డ్రై మామిడి పొడి): ½ tsp
జీలకర్ర: ½ tsp
ఆవాలు: 1/2tsp
బే ఆకు :1
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పెసరపప్పు మరియు తడ్కాదాల్(శెగపప్పు), బంగాళదుంపల ముక్కలు శుభ్రంగా కడిగి 10-15నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని ప్రెజర్ కుక్కర్ లో వేయాలి. అందులో ఉప్పు మరియు పసుపు వేసి 2,3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. అంతలోపు, ఫ్రైయింగ్ పాన్ లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
3. ఆవాలు, జీలకర్ర చిటపటాలాడాక, అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించిుకోవాలి.
4. ఇప్పుడు అందులో క్యారెట్, క్యాప్సికమ్, మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. 5నిముషాలు మీడయం మంట మీద వేయించుకొన్న తర్వాత క్యారెట్ మరియు క్యాప్సికమ్ మెత్తగా అవుతుంది.
5. ఇప్పుడు కుక్కర్ మూత తీసి, రుచికి సరిపడా మరికొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
6. వెజిటేబుల్స్ మెత్తగా వేగుతున్నప్పుడు అందులో టమోటో ముక్కలు, కారం, మరియు గరం మసాలా వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని 2.3 నిముషాలు వేయించుకోవాలి. తర్వాత కుక్కర్ లో వేయించి పెట్టుకొన్న దాల్ ను అందులో పోయాలి.
7. అవసరం అయితే కొద్దిగా నీళ్ళుజోడించుకోవచ్చు, బాగా మిక్స్ చేసి తర్వాత ఉడికించుకోవాలి.
8. ఒక 5నిముషాలు ఎక్కువ మంట పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో డ్రై మ్యాంగో పొడి చిలకరించి, స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
అంతే దాల్ వెజిటేబుల్ రిసిపి రెడీ, దీన్ని రోటి లేదా వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి.

English summary

Spicy Vegetable Dal Recipe

Dal is an Indian lentil soup that is prepared with lentils and other grams and pulses. There are many types of dal that can be prepared as a side dish for the main course. You can either boil dal with few spices like turmeric and salt or make it delicious by adding a few vegetables.
Story first published: Thursday, February 6, 2014, 12:04 [IST]
Desktop Bottom Promotion