For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పినాచ్(ఆకుకూర)కట్ లెట్ రిసిపి-బ్రేక్ ఫాస్ట్ స్పెషల్

|

ప్రతి రోజూ ఉదయం ఒక హెల్తీ మరియు కడపు నింపే బ్రేక్ ఫాస్ట్ మీలు తప్పకుండా తీసుకోవాల్సిందే. ఈ రోజు మీరు ఒక కొత్త వంటను ప్రయత్నించవచ్చు. ఈ స్పినాచ్ (ఆకుకూర)కట్ లెట్ లైట్ గ్రీన్ కలర్ తో నోరూరిస్తుంటుంది. ఇది పిల్లలకు కూడా ఎక్కువగా ఇష్టపడుతారు. ఆకుకూరలు తినని వారికి ఈ విధంగా కట్ లెట్ రూపంలో అంధించవచ్చు. పిల్లలకు ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ అంధించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

స్పినాచ్ కట్ లెట్ రుచి మాత్రమే కాదు, మంచి పోషకాహారం కూడా. ముఖ్యంగా పిల్లలకు మరియు మహిళలకు. గర్భిణీలకు మరింత సురక్షితమైన ఆహారం. స్పినాచ్ కట్ లెట్ తీసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఇది కడుపులో పెరిగే శిశువు కూడా చాలా మంచిది. మరి మీరెందుకోసం ఇంకా వేచిచూస్తున్నారు?ఈ టేస్టీ స్పినాచ్ కట్ లెట్ తయారుచేయడం మొదలు పెట్టండి...కొత్త రుచిని ఎంజాయ్ చేయండి...

Spinach Cutlet Recipe For Breakfast

ఆకుకూర: 2cups(సన్నగా తరిగినది)
బంగాళాదుంప:1 (ఉడికించి, పొట్టుతీసి మెత్తగా చిదుమిపెట్టుకోవాలి)
ఆయిల్: 2tbsp
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
అల్లం పేస్ట్: 1tbsp
గరం మసాలా: ½ tsp
శెనగపిండి: 1cup
బ్రెడ్ పొడి: 2cup
నీరు: ½cup
నూనె: డీప్ ఫ్రై చేయడానికి
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక , అందులో ఉల్లిపాయ, పచ్చిమర్చి ముక్కలు మరియు అల్లం పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
2. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోఆకుకూర తరుగు వేసి, మీడియం మంట మీద బాగా వేగించుకోవాలి. ఆకు కూర మెత్తగా ఫ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాలదుంప, గరం మసాలా, ఫ్రై చేసుకొన్నఆకుకూర మిశ్రమం మరియు ఉప్పు కూడా వేసి అన్నింటిని చేత్తో కలుపుతూ మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు ఈ కలుపుకొన్న మిశ్రమంలో నుండి కొంత చేతిలో తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
5. మరొక బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, ఉప్పు మరియు కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా కలుపుకోవాలి.
6. ఇప్పుడు చిన్నచిన్న ఉండలుగా తయారుచేసిన వాటని అరచేతిలో తీసుకొని కట్ లెట్ లా ఒత్తుకొని, శెనగపిండి మిశ్రమంలో డిప్ చేయాలి.
7. కట్ లెట్ రెండు వైపులా శెనగపిండి మిశ్రమం బాగా పట్టేలా డిప్ చేయాలి . ఇప్పుడు వీటిని బ్రెడ్ పొడిలో వేసి రెండు వైపులా అద్దాలి.
8. స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి అందులో నూనె పోసి, మీడియం మంట మీద కాగనివ్వాని, నూనె కాగిన తర్వాత బ్రెడ్ పొడిలో అద్ది పెట్టుకొన్నకట్ లెట్ ను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే స్పినాచ్ కట్ లెట్ రెడీ . ఈ గ్రీన్ కట్ లెట్ తో హెల్తీ సాండ్విచ్ ను హ్యాపీ తిని ఎంజాయ్ చేయవచ్చు. మీకు ఇష్టమైతే టమోటో సాస్ కూడా టాపింగ్ చేసుకోవచ్చు.

English summary

Spinach Cutlet Recipe For Breakfast

Each morning, you need to start off with a healthy and a filling breakfast meal. Today, we have something special for you to try out.
Story first published: Thursday, December 12, 2013, 17:36 [IST]
Desktop Bottom Promotion