For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దహీ వడ: రక్షాబందన్ స్పెషల్

|

రక్త సంబందానికి రూపం రక్షా అత్మీయ బందానికి ఆదారం రాఖీ ఆ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువుల తీయటి జ్ఞాపకం రక్షాబందన్‌ తరాలుమారిన తరగని వన్నేతో తారతమ్యం లేకుండా జరుపుకుంటున్న పండుగ రక్షాబందన్‌. తోబుట్టువుల అప్యాయత అనురాగం ఎప్పటికి ఎవ్వరు మరువలేరు ఈ అనుబంధానికి ప్రతికగా నిలిచే శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దేశవ్యాప్తంగా పండుగరోజు అన్నదమ్ముళ్లకు అక్కాచెల్లెల్లు తప్పకుండా రాఖీలు కట్టాలని ఆరాటపడుతుంటారు.

అత్మీయతను పెంచే బందం మరింత బలపడాలంటే రక్షాబందన్ తో పాటు నోటికి కమ్మని రుచికరమైన వంటను రుచిచూపించాల్సిందే. ఎప్పడూ రెగ్యులర్ గా చేసుకొనే వంటలు కాకుండా, ప్రత్యేకంగా ఇలా శుభకార్యాలప్పడు డిఫరెంట్ వంటలను తయారుచేసుకుంటే ఆ అకేషన్ కే మరికొంత అనందం, ఆహ్లాదం తోడవుతాయి. మరి మీ తోబుట్టువులకు, అన్న, తమ్ములకు రక్షాబందన్ రోజున ప్రత్యేకంగా ఉండాలంటే ఒక స్పెషల్ వంటను రుచి చూపించండి. అటువంటి వంటల్లో ఒకటి పెరుగు వడ, చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇది మీ తోబుట్టువులకు పెడితే మీ బందంగా కూడా తీయగా, కమ్మగా ఉంటుంది. కమ్మని పెరుగు వడతో రక్షాబందన్ సెలబ్రేట్ చేసుకోండి...

Steamed Dahi Vada Treat For Brothers

కావల్సిన పదార్థాలు:

ఉద్దిపప్పు: 1/2 cup
పెసరపప్పు: 1/2cup
అల్లం: కొద్దిగా
ఉప్పు: 1/2tsp
పచ్చిమిర్చి: 2-3
బేకింగ్ సోడా: చిటికెడు
దహీ మిక్స్
పెరుగు: 250grms
ఉప్పు: 1/2tsp
జీలకర్ర పొడి :2tsp
కారం: 1tsp
ఛాట్ మసాలా పౌడర్: 1tsp
కొత్తిమీర: 2tbsp

తయారుచేయు విధానం :

1. ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకొని అందులో అరకప్పు నీళ్ళు పోసి బాగా బీట్ చేయాలి. తర్వాత దహీ మిశ్రమం కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని కూడా(కొత్తిమీర మినహాయించి) అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ స్పైసీ పెరుగును ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.
2. పప్పును 4-6నీళ్ళలోపోసి నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిన తర్వాత నీరు వంపేసి, మిక్సీలో వేసి నీళ్ళు పోయకుండా గరుకుగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఇడ్లీ స్టాండ్ లో కొద్దిగా నూనె రాసి మీడయం మంట పెట్టి, ఆవిరి పట్టించడానికి సిద్దంగా ఉంచుకోవాలి. ఆవిరికి పట్టించడానికి అవసరం అయ్యేంత నీరు ఇడ్లీ పాత్రలో వేయాలి.
4. రుబ్బుకొన్న పప్పు ముద్దలో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం కొద్దిగా పల్చగా ఉన్నట్లైతే అందులో 2లేదా 3 టేబుల్ స్పూన్లవేసి బాగా మిక్స్ చేయాలి . చివరగా కొద్దిగా సోడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. దహీవడకు మిశ్రం రెడీ.

స్టీమ్డ్ కర్డ్ వడ తయారుచేయడం:
1. ఇప్పుడు ఇడ్లీప్లేట్స్ తీసుకొని అందులో గరిటె నిండుగా దహీ వడ మిశ్రమాన్ని వేయాలి.
2. ఇప్పుడుఈ ఇడ్లీ స్టాండ్ ను ఇడ్లీ కుక్కర్ లో పెట్టి 1520నిముషాలు ఆవిరిమీద ఉడికించుకోవాలి.
3. ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి . దహీ వడను సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. 5 నిముషాలు చల్లారనివ్వాలి.
4. 2 గ్లాసులో అరటీస్పూన్ ఉప్పు వేసి వడను ఈ నీటిలో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
సర్వింగ్:
1. ఒక బౌల్లో రెండు మూడు వడలను వేయాలి.
2. ఇప్పుడు వడల మీద పెరుగు పోయాలి. తర్వాతకొద్దిగా కారం మరియు బ్లాక్ పెప్పర్ మరియు కొత్తిమీర తరుగు చిలకరించాలి. అంతే దహీ వడ రెడీ. రక్షాబందన్ స్పెషల్ దహీ వడ రెడీ. మీ బ్రదర్స్ కు తప్పకుండా నచ్చుతుంది.

English summary

Steamed Dahi Vada Treat For Brothers

Steamed Dahi Vada Treat For Brothers
Story first published: Saturday, August 9, 2014, 12:37 [IST]
Desktop Bottom Promotion