For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ అండ్ టేస్టీ మెంతి పప్పు

|

రోజంతా అలసిపోయినప్పు హెల్తీగా మరియు టేస్టీగా ఏదైనా తినాలనుకొన్నప్పుడు ఈ మేతి దాల్ రిసిపి మీ టేస్ట్ బడ్స్ కొత్తరుచిని అందిస్తుంది. అంతే కాదు, పుష్కలమైన న్యూట్రీషియన్స్ కూడా మన శరీరానికి చేరేలా సహాయం చేస్తాయి. ఈ ఫర్ఫెక్ట్ మేతీ దాల్ రిసిపి లైట్ డిన్నర్ కు ఫర్ఫెక్ట్ గా నప్పుతుంది .

ఈ రుచికిరమైన ఆరోమాటిక్ డిష్ మేతి కలర్లో లేదా ఎల్లో కలర్లో తడ్కాగా లాగా ఉంటుంది . ఇది ఇందులో వేసే కందిపప్పు లేదా పెసరపప్పు వల్ల ఈ రంగు రుచి వస్తుంది. ఇది పూర్తి న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. మరి ఈ రుచికరమైన హెల్తీ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Step by Step Quick Methi Dal Recipe

కావల్సిన పదార్థాలు:
మెంతి ఆకు: 1కట్ట
పెసరప్పు లేదా కందిపప్పు: 2cups
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిర్చి: 3-4
ఆవాలు: 1tsp
ఎండు మిర్చి: 2
జీలకర్ర: 1tsp
ఉల్లిపాయ: 1చిన్నది
టమోటోలు: 2చిన్నవి
వెల్లుల్లి: 5-6
పసుపు: 1/2tsp
ఇంగువ: 1/2tsp
కారం: 1tsp
కొత్తిమీర: గార్నిష్ చేయడానికి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
వెన్న: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా కుక్కర్ లో పప్పు వేసి మీడియం మంట మీద ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, మరియు ఎండు మిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి క్రిస్పీగా వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే జీలకర్ర కూడా వేసి ఒక నిముషం వేగిన తర్వాత పచ్చిమిర్చి, మరియు టమోటో కూడా వేసి 3లేదా 4 నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత అందులో కారం, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేసి మెంతి ఆకు కూడా వేసి మూడు, నాలుగు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా వేగించి పెట్టుకొన్న పప్పు కూడా అందులో వేసి కొద్దిగా బటర్ వేసి మిక్స్ చేసి, రెండు నిముషాలు ఉడికించుకోవాలి.
6. చివరగా కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన మెంతిపప్పు రెడీ...

Story first published: Saturday, December 13, 2014, 17:42 [IST]
Desktop Bottom Promotion