For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టఫ్డ్ టొమాటో: టేస్టీ డిష్

|

రెగ్యులర్ గా వండే వంటలతో చాలా బోర్ కొడుతోందా? మరి మీరు ఏదైనా కొత్తగా చేయాలకుంటున్నారా?ఈ టమోటోలను పనీర్, పొటాటో మరియు డ్రై ఫ్రూట్స్ తో స్టఫ్ చేసి తయారుచేసి క్రీమీ గ్రెవీ చాలా అద్భుతమైన రుచి ఉంటుంది.

స్టఫ్డ్ టమోటో మలై గ్రేవీ ఒక అద్భుతమైన రుచిగల వెజిటేరియన్ రిసిపి. ఇది మీకు ఒక ఫర్ ఫెక్ట్ ఎంపిక. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వస్తున్నారంటే ఇటువంటి స్పెషల్ వంటలను తాయరుచేయండి. వారి ప్రశంసలు పొందండి. మరి ఈ అద్భుతమైన రుచి గల వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Stuffed Tomatoes: Tasty Dish

కావలసిన పదార్థాలు:
ఎర్రగా ఉన్న టొమాటోలు: 2
ఆలివ్ ఆయిల్ : 1tsp
వెల్లుల్లి రేకలు: 2
ఉల్లి తరుగు: 1/2cup
జీలకర్ర: 1/2tsp
వంకాయ ముక్కలు: 1/2cup
వెనిగర్: 2tbps
టొమాటో ముక్కలు: 1/2cup
పుదీనా ఆకులు: 5
నువ్వుపప్పు : 3tbsp
పైన్‌నట్స్: 2tbsp
కారం: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాలపొడి: 1/2tsp
కొత్తిమీర తరుగు: 1cup

తయారు చేయు విధానం:
1. ముందుగా ఓవెన్ ను 375 డిగ్రీల దగ్గర వేడి చేయాలి.
2. తర్వాత టొమాటోలపై భాగాన్ని కట్ చేసి, లోపల ఉండే గుజ్జును స్పూను సహాయంతో జాగ్రత్తగా తీయాలి.
3. ఇప్పుడు ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లిరేకలు, ఉల్లి తరుగు, జీలకర్ర వేసి మూడు నిమిషాలు వేయించాలి.
4. వంకాయ ముక్కలను జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
5. తర్వాత ఒక చిన్న బాణలిలో వెనిగర్, టొమాటో ముక్కలు వేసి వేయించాలి.
6. అలాగే అందులోనే పుదీనా ఆకులు, కారం జత చేసి రెండు నిమిషాలు వేయించి దించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
7. మరో బాణలిలో కూరగాయ ముక్కలకు, నువ్వుపప్పు, పైన్ నట్స్ జత చేసి కలపాలి. వేడిగా ఉండగానే మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి దించేయాలి
8. పైన తయారుచేసుకున్న పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
9. పెద్ద స్పూన్‌తో ఈ మిశ్రమాన్ని టొమాటోలలో స్టఫ్ చేయాలి.
10. తర్వాత బేకింగ్ షీట్ మీద ఉంచి ఓవెన్ లో 20 నిమిషాలు బేక్ చేయాలి. 20 నిముషాల తర్వాత బయటకు తీసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే స్టఫ్డ్ టమోటో రెడీ

English summary

Stuffed Tomatoes: Tasty Dish

Stuffed tomatoes in malai gravy is an excellent vegetarian recipe. It is a perfect option for you to try if you have some guests coming in for the evening or if you are planning a potluck. This delicious recipe will leave your taste-buds craving for more.
Story first published: Monday, October 13, 2014, 13:01 [IST]
Desktop Bottom Promotion