For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శెనగల నైవేద్యం-నవరాత్రి స్పెషల్

|

దసరా దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి.

తొమ్మిది రోజులు సంతోషంగా సందడిగా జరుపుకునే ఈ పండుగ భారత సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఉదయాన్నే మహిళలు లేచి ఇళ్ళు, వాకిళ్ళు కడిగి ముగ్గులు వేస్తారు. స్నానపానాదులు చేసి భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన దేవి మాతను కొలుస్తుంటారు. నవరాత్రి స్పెషల్ గా దుర్గా మాతకు రోజుకో నైవేద్యం తయారు చేసి ఆ తల్లి పెడుతుంటారు. నైవేద్యాల్లో శెనగలతో తయారుచేసే నైవేద్యం చాలా పవిత్రమైనది. ఈ వంటతో అమ్మవారికి నైవేద్యం పెట్టండి...

Sundal For Navratri Special Naivedyam

శెనగలు/కాబులి శెనగలు : 1/2kg
ఆవాలు: 1tsp
జీలకర్ర : 1tsp
ఎండుమిర్చి : 2
ఉప్పు : రుచికి సరిపడ
కారం : 1/2tsp
కరివెపాకు: రెండు రెమ్మలు
నూనె : 1tbps
పచ్చి కొబ్బరి తరుము : సరిపడ

తయారుచేయు విధానం :
1. ముందుగా శెనగలు రాళ్ళు లేకుండా శుభ్రం చేయాలి.
2. తర్వాత వీటిని ఓ గిన్నెలో నీళ్ళు పోసి 4-6గంటలు నానబెట్టాలి.
3. తర్వాత స్టౌ మీద కుక్కర్‌లో శెనగలు, తగినంత నీళ్లు పోసి ఉడకబెట్టాలి. రెండు విజిల్స్‌ వచ్చాక స్టౌ ఆపేయాలి. ఆవిరి పోయాక మూత తీసి ఉడికినవో లేదో చూడాలి. ఉడకకపోతే మరలా ఉడకనివ్వాలి.
4. శెనగలు ఉడికిన తర్వాత నీళ్ళు లేకుండా శనగలను పక్కకు తీసి పెట్టుకోవాలి.
5. స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివెపాకు వేసి వేగనివ్వాలి.
6. ఒక నిముషం తర్వాత అందులోనే కారం, ఉప్పు వేసిన తరువాత ఉడికిన శనగలు వేయాలి. కొంచెం కలిపిన తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. అంతే. నవరాత్రి స్పెషల్ గా దుర్గా మాతకు శెనగల నైవేద్యం రెడీ

English summary

Sundal For Navratri Special Naivedyam

During Navratri most people observe fast for a few days or for all the nine days. During the fast they can eat only certain things. These food items include buckwheat flour, sabudana or sago, sundal special kind of vrat rice etc.
Story first published: Monday, October 7, 2013, 12:47 [IST]
Desktop Bottom Promotion