For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుమ్మడికాయ గ్రేవీ రిసిపి

|

గుమ్మడికాయ వంటల గురించి ఈతరం పిల్లలకు పెద్దగా తెలీదు. కారణం గుమ్మడి వంటలు తయారుచేయడం బాగా తగ్గిపోవడమే. ముద్ద పప్పు, గుమ్మడికాయ పులుసులాంటి సాంప్రదాయ కాంబినేషన్ కూడా ఇప్పుడు ఏ కిచెన్‌లోనూ కనిపించడం లేదు. పప్పు, పులుసు అవుట్‌డేటెడ్. కొత్తదేమైనా ఉంటే చెప్పండంటున్నారు ఈ తరం ఆహారప్రియులు.

గుమ్మడితో ఏరకమైన వంట వండినా చాలా టేస్ట్ గా ఉంటుంది. అంతే కాదు, ఆరోగ్యం విలువలు కూడా ఎక్కువే. గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిల్లు ఉంటుందా?ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి. గుమ్మడితో చేసిన వంటకాలు తినండి...కడుపులో కూడా దిష్టి పోయి హాయిగా ఉంటుంది. ఇంటికీ, ఒంటికీ మంచి చేసే గుమ్మడి ఎప్పుడు వండుకుంటే అప్పుడే పండగ! గుమ్మడికాయ లాంటి మీ ‘ఫ్యామిలీ' కోసం ఈ రోజు ఘుమ్మడి ట్రీట్ స్వీట్ పంప్కిన్ గ్రేవీతో ఎంజాయ్ చేయండి!!

Sweet Pumpkin Gravy Recip

కావల్సిన పదార్థాలు:
గుమ్మడికాయ: 1/4(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తాజా కొబ్బరి : కొద్దిగా(తురిమినది)
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పసుపు: 1/2tsp
బెల్లం: చిన్న ముక్కలుగా చేసుకోవాలి
ఉప్పు: రుచికి సరిపడా

పోపుకోసం:
నూనె: 1tbsp
ఆవాలు: 1tsp
ఉద్దిపప్పు: 1tsp
కరివేపాకు: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో గుమ్మడికాయ ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు, మరియు పసుపు కూడా సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కుర్కర్ మూత తీసి, గుమ్మడికాయను మెత్తగా మ్యాష్ చేయాలి . ఎక్కువగా మెత్తగా చేయకుండీ మీడియంగా రఫ్ చేయాలి.
3. ఇప్పుడు అదే కుక్కర్ లోనే కొబ్బరి తురుము మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
4. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఉద్దిపప్పు, కరివేపాకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
5. పోపు వేగిన తర్వాత కుక్కర్ లో మిక్స్ చేసి పెట్టుకొన్ని గుమ్మడి, కొబ్బరి మిశ్రమాన్ని పోపులో పోసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని, ఉడికించుకోవాలి. అంతే స్వీట్ పంప్కిన్ (గుమ్మడికాయ) గ్రేవీ రిసిపి రెడీ...

English summary

Sweet Pumpkin Gravy Recip

This special Chithirai Kani dish is made to celebrate this beautiful New Year. The special dish is made with sweet pumpkin, coconut and green chillies which will add a specific taste to the recipe. Moreover, the coconut too will add a beautiful aroma to the dish and thus will taste better with white rice or rotis.
Story first published: Saturday, May 2, 2015, 15:16 [IST]
Desktop Bottom Promotion