For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్ శాఫ్రాన్ రైస్ -రక్షాబంధన్ స్పెషల్

|

వంటకాలలోనే కాదు...అనుబంధాలలోనూ తియ్యదనం ఉంటుంది. అన్నాచెల్లెళ్ల ఆత్మీయతలో మరింతగా ఉంటుంది. అదే రక్షాబంధనమై కాపాడుతూ ఉంటుంది. రక్తసంబంధానికి సాటిలేనిదని నిరూపిస్తూ ఉంటుంది. రాఖీ పండగ రోజున చేతికి రక్ష కట్టండి. అనుబంధాల రుచిని చేర్చి నోటిని తీపి చేయండి.

అన్నదమ్ములకి కట్టే రాఖీలను ఈ పాటికే కొనేసి ఉంటారు. మరి రాఖీ కట్టిన తరువాత నోట్లో పెట్టే స్వీటును కూడా షాపుల్లో కొనుక్కుని వెళ్తే ఏం బాగుంటుంది. మీరే స్వయంగా చేశారనుకోండి పర్సనల్ టచ్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని ఇంట్లో వెరైటీగా చేసుకునే ఒక వెరైటీ వంటకం మీకోసం..

Sweet Saffron Rice

కావలసిన పదార్థాలు:

ముప్పావు కప్పు బియ్యం,
అర టీస్పూను కుంకుమపువ్వు(శాఫ్రాన్)
రెండు టేబుల్ స్పూన్లు వేడి పాలు
45 గ్రాముల శుద్ధిచేసిన వెన్న
ముప్పావుగ్లాసు చల్లటి పాలు
మూడు యాలక్కాయలు
దాల్చినచెక్క ఒకటి
నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార,
రెండు టేబుల్ స్పూన్ల మీగడ,
30 గ్రాముల తరిగిన వాల్‌నట్ ముక్కలు,
అర కప్పు ఎండు ద్రాక్ష

తయారు చేయు విధానం:
1. ముందుగా పాలలో కుంకుమపువ్వు నానపెట్టాలి. బియ్యాన్ని ఐదు నిమిషాల పాటు ఉడికించి వడకట్టాలి.
2. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో బటర్ వేసి కరిగించి ఉడికించిన బియ్యాన్ని యాలక్కాయగింజల్ని, దాల్చినచెక్కను వేసి మూడు నిముషాలపాటు వేగించాలి.
3. ఇప్పుడు చల్లటిపాలలో పంచదార కలిపి పెట్టుకోవాలి. పాన్ మీద మూతపెట్టి బియ్యాన్ని తక్కువ సెగపైన ఉడికించాలి.
4. ఇందులో మీగడ, కుంకుమపువ్వు కలిపిన పాలు కలపాలి. మూతపెట్టి సన్నటి సెగపైన ఒక నిమిషం పాటు ఉడికించి వడ్డించే గిన్నెలో తీసుకుని నట్స్, ఎండుద్రాక్షలు వేసి అలంకరించాలి. తియ్యతియ్యటి శాఫ్రాన్ రైస్ రెడీ.

English summary

Sweet Saffron Rice-Raksha Bandhan Special Recipe

The much awaited Indian festival, Raksha bandhan is just round the corner. Raksha bandhan symbolises the special bond between brothers and sisters. Like any other Indian festival, it goes without saying that good food is the most important part of the celebration.
Story first published: Tuesday, August 20, 2013, 16:19 [IST]
Desktop Bottom Promotion