హెల్తీ బ్రేక్ ఫాస్ట్ స్వీట్ అంట్ స్పైసీ వెజిటేబుల్ దోసె

Posted By:
Subscribe to Boldsky

వెజిటేబుల్ దోసె కలర్ ఫుల్ గా రుచిగా ఉండటమే కాకుండా ఉదయాన్నే తీసుకొనే ఈ బ్రేక్ ఫ్యాస్ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో బియ్యంకు బదులు, గోధుమపిండి, మైదా,రవ్వ, బాదాం పొడిలను చేర్చడం వల్ల రోజంతా కావల్సిన శక్తిని అందిస్తుంది. వస్తువులు కూడా తక్కువ. తయారు చేయు విధానం చాలా సులభం. మరి పిల్లలు, పెద్దలకి బోరు కొట్టకుండా ఈ వెరైటీ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసి అందించండి. చాలా ఇష్టంగా తినేస్తారు.

Sweet and Spicy Vegetable Dos

గోధుమ పిండి: 1 cup
మైదా: 1cup
బాదాం పౌడర్: 1/2cup
రవ్వ: 1 glass
క్యారెట్ తురుము: 1/2cup
బంగాళదుంప తురుము: 1/2cup
ఉల్లిపాయ ముక్కలు: 1cup
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం తురుము: కొద్దిగా

తయారు చేయు విధానం:
1. వెజిటేబుల్ దోసె కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
2. గ్రైడ్ చేసేటప్పుడు ఒక చెంచా పంచదార కూడా చేర్చి, తగినన్ని నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి.
3. గ్రైడ్ చేసుకొన్న దోసె మిశ్రమాన్ని అరగంట పాటు అలాగే ఉంచాలి. అంతలోపు కొత్తిమీర తీసుకొని శుభ్రం చేసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పిండిలో కలుపుకోవాలి.
4. అరగంట తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, వేడిఅయ్యాక అందులో కొద్దిగా నూనె రాసి రుబ్బి పెట్టుకొన్న దోసె పిండిని దోసెలా పోయాలి. ఒక నిముషం తర్వాత దోసె పైన కూడా నూనె వేయాలి.
మీడియం మంటమీద దోసెను నిదానంగా రెండు వైపుల లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ కాల్చాలి. అంతే వెజిటేబుల్ దోసె రెడీ. మీకు ఇష్టమైన చట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా

English summary

Sweet and Spicy Vegetable Dos | వెజిటేబుల్ దోసె-హెల్తీ బ్రేక్ ఫాస్ట్

If you have such complaints at home or your kids are that way.. Then you should make this all vegetable nutritious dosa roll which no kid would deny. It was a huge savory pancake stuffed with a spicy vegetable mixture with some chutneys and sauces on the side. The dosa was spicy, sweet, tart, with a variety of exciting textures as well: crunchy, soft, moist and dry. Exciting!
Please Wait while comments are loading...
Subscribe Newsletter