For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే పచ్చిమామిడికాయ పచ్చడి

|

ఆవకాయ రుచెరుగని ఆంధ్రుడుంటాడా ? తెలుగింటి పచ్చళ్లలో ఆవకాయది ప్రత్యేక స్థానం. వేసవికాలం వచ్చిందంటే మిరపకాయలు కొనడం, దానిని కారం పట్టించడం, ఆవపిండి తయారు చేసుకోవడం ఆ తరువాత మామిడికాయల కోసం ఎదురు చూస్తుండడం కనిపిస్తుంది.

వేసవికాలం వచ్చిందంటే చాలు.. లేలేత మామిడికాయల వగరు.. పులుపు నోరూరిస్తాయి. మామిడికాయ తో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి.ఈ కాలంలో మాత్రమే లభించే మామిడికాయతో చేసే ఎన్నో వంటకాలు భానుడితాపాన్ని సైతం భరించేలా చల్లదనానిస్తాయి.. లేత మామిడితొక్కు.. చిన్నచిన్న ముక్కల పచ్చడి, కొబ్బరితో కలిపి పచ్చడి, మామిడి కాయ పప్పు, మామిడి కాయ చారు, మామిడి కాయ షర్భత్‌, పులిహార ఇలా ఎన్నో వెరైటీలకు మామిడికాయ పెట్టింది పేరు.. మరి మార్కెట్‌లో లభించే మామిడికాయలతో నోరూరించే వంట మామిడికాయపచ్చడితో సమ్మర్ స్పెష్ల స్టార్ట్ చేద్దామా...

tangy Raw Mango Pachadi: Summer Special
కావాల్సిన పదార్ధాలు:

మామిడి కాయలు : 3
ఎండు మిరపకాయలు: 15
పచ్చి మిరపకాయలు: 5
మినపప్పు : 1tbsp
మెంతులు : 1tsp
ఆవాలు : 1/2tsp
ఇంగువ : 1tsp
పసుపు : చిటికెడు
ఉప్పు : 2tsp
నూనె : 2tsp

తయారు చేసే విధానం :

1. ముందుగా మామిడి కాయలను బాగా కడిగి పెచ్చు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
2. తరవాత ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని అందులో నూనే వేసి పైన చెప్పిన మినపప్పు,ఆవాలు,మెంతులు,ఇంగువ,పసుపు,ఎండు మిరపకాయలు, వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి.
3. పోపు చల్లారిన తరువాత ఒక స్పూన్ పోపుని తీసి పక్కన పెట్టుకుని ఈ పోపు నంతా గ్రైండర్ లో వేసి పచ్చి మిరపకాయలు, ఉప్పు, మామిడి ముక్కలు కూడా వేసి మెత్తగా రుబ్బాలి.
4. అవసరమైతే కొద్దిగా నీరు పోసి రుబ్బుకోవచ్చు. తరవాత పక్కన పెట్టిన పోపుని పచ్చడిలో కలపాలి. అంతే ఘుమ ఘుమ లాడే రుచికరమైన మామిడి కాయ పచ్చడి రెడీ. ఇంక మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడమే.

English summary

tangy Raw Mango Pachadi: Summer Special

The season of mangoes is here. From the tangy raw mangoes to the juicy and sweet pulpy ripe ones, you can Enjoy the 'king of all fruits' throughout summers. Before the juicy and pulpy mangoes come in the market, it is the raw green mangoes which arrive first.
Desktop Bottom Promotion